గోళ్లు కొరకడం అనేది కొందరికి చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది. దాన్ని వారు మానలేరు. పెద్దయ్యాక కూడా గోళ్లను కొరుకుతూనే ఉంటారు. ఇక కొందరికి పెద్దయ్యాక అలవాటు అవుతుంది. అయితే గోళ్లు ఎందుకు కొరుకుతారు ? దాని వెనుక ఉండే కారణాలు ఏమిటి ? గోళ్లు కొరికితే ఏమవుతుంది ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఎవరైనా సరే ఆందోళనగా, ఒత్తిడితో ఉన్నా, కంగారు పడుతున్నా.. ఆ భావాలను అణచుకునేందుకు గోళ్లను కొరుకుతుంటారు. దీన్నే వైద్య పరిభాషలో onychophagia అంటారు.
ఇక గోళ్లు కొరకడం అనేది చిన్నప్పటి నుంచే కొందరికి అలవాటు అవుతుంది. దాన్ని వారు అలవాటుగా మార్చుకుంటారు. ఇలాంటి వారు ఒత్తిడి, ఆందోళన లేకున్నా పదే పదే గోళ్లను కొరుకుతుంటారు. ఇలా అలవాటు ఉంటే మార్చడం కష్టం.
కొందరు బోర్ కొట్టడం వల్ల కూడా గోళ్లను కొరుకుతుంటారు. వంశపారంపర్యంగా కూడా ఈ అలవాటు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే గోళ్లను కొరకడం అనేది నిజానికి ఆరోగ్యానికి మంచిది కాదు. గోళ్లలో అనేక సూక్ష్మ క్రిములు ఉంటాయి. కనుక తరచూ దగ్గు, జలుబు, జ్వరం లేదా జీర్ణ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల గోళ్లను కొరకడం మానేయాలి.
ఇక జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం చూసినా గోళ్లను కొరకడం మంచిది కాదు. గోళ్లను కొరికితే అశుభం కలుగుతుంది. కనుక అలా చేయరాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…