తెలుగు వారికి కార్తీక దీపం సీరియల్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో హిట్ అయిన సీరియల్ ఇది. నలుగురు కలిస్తే దీని గురించే మాట్లాడుకుంటారు. సీరియల్స్ అంటే కేవలం మహిళలు మాత్రమే చూస్తారు, అని అనే వారు. కానీ కార్తీక దీపం సీరియల్ ను పురుషులు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ సీరియల్ లో దీప.. వంటలక్క.. అందరూ అభినందించే పాత్ర. ఈమెకు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సీరియల్ అంతలా సూపర్ హిట్ అవడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అవేమిటంటే..
సాధారణంగా తెలుగు ప్రేక్షకులు సినిమా లేదా సీరియల్.. ఏది చూసినా సరే ఓన్ (Own) చేసుకుంటారు. అంటే వాటిలో లీనమవుతారు. కార్తీక దీపం సీరియల్‌ను కూడా అలాగే ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ సీరియల్‌లోని సంఘటనలు వాస్తవ స్థితి గతులకు దగ్గరగా ఉంటాయి. మన సమాజంలో మన ఇంట్లో లేదా ఇరుగు పొరుగు ఇండ్లలో జరిగే సంఘటనలే మనకు ఈ సీరియల్‌లో కనిపిస్తుంటాయి. అందుకనే ఈ సీరియల్ ప్రేక్షకులకు అంతగా నచ్చింది. ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.
ఇక ఇందులో దీప అనే మహిళ నల్లగా ఉంటుంది. నల్లగా పుట్టడం అనేది తప్పు కాదు. ఒకరు ఏ కలర్‌తో జన్మిస్తారు అనేది వారి చేతులో ఉండదు. అయినప్పటికీ మన దేశంలో నల్లగా ఉండడం అంటే ఎదుటి వారు చిన్న చూపు చూస్తారు. నలుపు రంగులో ఉంటే వివక్షను ప్రదర్శిస్తారు. మన దేశంలో చాలా మంది ఇలాంటి ఫీలింగ్స్ నే ఎదుర్కొంటున్నారు. కానీ దీప అన్ని సమస్యలను తట్టుకుని ముందుకు సాగుతుంది. ఇది వీక్షకులకు నచ్చింది. ఈ సీరియల్ హిట్ అవడం వెనుక ఉన్న ఇంకో కారణం ఇది.
అందుకనే ఏ సీరియల్‌కు రాని టీఆర్‌పీ రేటింగ్స్ దీనికి వస్తున్నాయి. అనేక వెబ్‌సైట్లలోనూ ఈ సీరియల్ గురించి రోజూ ఎపిసోడ్స్ లో ఏం జరిగింది అని రాస్తున్నారు. పాఠకులు కూడా ఆదరిస్తున్నారు. బహుశా ఏ సీరియల్‌కు ఇంతటి ఆదరణ రాలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…