రాత్రి 11.30 గంటలు అవుతోంది. ఆమె నాతో వాట్సాప్‌లో చాట్ చేస్తోంది. ఆమెకు నిద్ర వస్తోంది. కానీ నాకు నిద్ర రావడం లేదు. ఆ రోజు పగలు నిద్రపోయా. అందుకని రాత్రి నిద్ర రావడం లేదు. ఆమె నాతో అన్నది..
ఆమె: నాకు బాగా నిద్ర వస్తోంది. గుడ్ నైట్. రేపు మాట్లాడుకుందాం.
నాకు ఇప్పుడప్పుడే నిద్ర పట్టదని తెలుసు. అందుకే ఒక పనిచేశా..
నేను: నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.
ఆమె: సరే, చెప్పు.
ఒక నిమిషం గడిచింది. నేను రిప్లై ఇవ్వలేదు. దీంతో ఆమెకు కుతూహలం ఎక్కువైంది. ఆ విషయం ఏమిటి ? అనేది తెలుసుకునేందుకు ఆమె వెంటనే రిప్లై ఇచ్చింది.
ఆమె: ఏమైంది.. చెబుతావా ?
నేను: వద్దులే, ఆ విషయం నీకు చెబితే నీకు కోపం వస్తుంది, ఇది సరైన టైమ్ కూడా కాదు, నీతో వాదించలేను.
ఆమె: నో.. నాకిప్పుడు ఆ విషయం చెప్పాల్సిందే. నాకేమీ కోపం రాదులే, ఏమీ అనుకోను, చెప్పు.
నేను: నిద్ర వస్తుందన్నావు కదా.. నిద్రపో.. అంతా మర్చిపో.. ఆ విషయం పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదులే.
ఆమెకు కుతూహలం మరింత ఎక్కువైంది. నిద్ర బాగా వస్తుందని చెప్పింది. కానీ నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఎలాగైనా ఆ విషయం తెలుసుకోవాలని ఆమెకు ఆందోళన మరింత ఎక్కువైంది.
ఆమె: ప్లీజ్ చెప్పు. అసలు విషయం ఏమిటి ? అది నాకు సంబంధించిందేనా ?
నేను: కాదు, నువ్వు నిద్రపో. నీకు కోపం వస్తుందని తెలుసు. నేను రిస్క్ తీసుకోలేను.
చివరకు ఆమె గంట పాటు విషయం చెప్పాల్సిందేనని పట్టుబట్టింది. తరువాత నేను ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయా. అప్పటికి రాత్రి 2 గంటలు అవుతోంది. ఆమె మాత్రం చాట్ చేస్తూనే ఉంది.
ఆమె: ప్లీజ్.. నాకు నిద్ర రావడం లేదు, అసలు విషయం ఏమిటో చెప్పు.
కొన్ని గంటల క్రితం ఆమె తనకు బాగా నిద్ర వస్తుందని చెప్పింది. కానీ అప్పుడు నాకు నిద్ర రావడం లేదు. దీంతో చిన్నగా ఏదో ఒక విషయం చెప్పాలని ఆమె మైండ్‌లో అనుమానం సృష్టించా. అసలు నిజానికి ఆమెకు చెప్పాల్సిన విషయం ఏమీలేదు. సరదాకి అలా అన్నా. కానీ ఆమె సీరియస్ తీసుకుంది. రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయా. కానీ ఆమెకు నిద్ర పట్టలేదు.
తరువాత రోజు ఆమె రియాక్షన్ ఇలా అనిపించింది..!
నిజానికి అది చాలా వింతగా అనిపించింది. కొందరి మైండ్ అలాగే ఉంటుంది. ఏదైనా అనుమాన బీజం నాటితే దాని గురించి తెలుసుకోవాలని వారికి కుతూహలంగా ఉంటుంది. అది నెగెటివ్‌గా ప్రభావం చూపిస్తుంది. ఓవర్‌గా ఆలోచిస్తారు. కొందరి మైండ్‌లు ఇలాగే పనిచేస్తాయి. వీటిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆమె విషయంలోనూ ఇలాగే జరిగింది. అసలు ఆమెకు చెప్పాల్సిన విషయం ఏమీ లేకపోయినా ఒక అనుమానం ఆమెను నిద్ర పట్టనివ్వలేదు. కొందరిపై ఇది నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…