ఆఫ్‌బీట్

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఈ వీధి కుక్కల బెడద వల్ల పిల్లలు సాయంత్రం వేళ.. తమకు స్థానికంగా ఉన్న పార్కుల్లో సైతం ఆడుకోవాలంటేనే భయపడుతున్నారు. వీధి కుక్కల దాడి వల్ల ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలను మీరు టీవీల్లో చూసే ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు కుక్కలంటే వెన్నులో వణుకు పుడుతుంది. పిల్లల్నే కాకుండా.. బైక్ పై వెళుతున్న వారి వెంబడించి కూడా కుక్కలు కరుస్తున్నాయి. ఈ కుక్కల భయంతో బైక్ ను ఫాస్ట్ గా నడిపి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే వీధి కుక్కలు మనపై దాచి చేయడానికి వెంబడించినప్పుడు వెంటనే ఏం చేయాలి? వాటి బారిన నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో తెలుసుకుందాం..

కుక్క వెంబడిస్తుంటే భయపడకండి. సాధారణంగా కుక్కలు చాలా తెలివైనవి.. ఎవరైనా వాటిని చూసి భయపడుతున్నారో అవి ఇంకా ధైర్యంగా పోరాడతాయి. అందుకే పారిపోతున్నవారిని కుక్కలు వెంబడిస్తుంటాయి. దీనికి బదులుగా కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తే ధైర్యంగా ఉండండి.కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తే.. భయంతో పరుగులు తీయకండి.. దీనికి బదులుగా నిశ్చలంగా నిలబడిపోతే అవి మిమ్మల్ని ఏమీ చేయవు. అదే సమయంలో కుక్కలు మీపై దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటిని నేరుగా చూడటం మంచిది కాదు. ఇలా నేరుగా చూస్తే వాటిని దాడికి రమ్మడి చెప్పినట్లు భావిస్తాయి.. అందుకే అవి మీ వెంట పడుతున్నా.. వాటిని పట్టించుకోనట్లు ప్రవర్తించండి.

ఇక కుక్కలు అకస్మాత్తుగా మిపై దాడి చేస్తే.. వాటి దృష్టిని మరల్చండి. మీకు అందుబాటులో ఉండే వస్తువును.. కుక్కకు చూపించి దూరంగా విసిరేయండి.. దీంతో అవి పరధ్యానంలోకి వెళ్లిపోతాయి. మీరు విసిరిన దానిపై కుక్కలు శ్రద్ధ చూపుతాయి.. మిమ్మల్ని పట్టించుకోవడం, వెంబడించడం మానేస్తాయి. కొన్ని కుక్కలు వాటిపై నీళ్లు చల్లితే పారిపోతాయి. ఇదే కాదు కుక్క ముక్కు లేదా కళ్లను గుడ్డతో కప్పడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అవి దాని వీక్ పాయింట్స్. ఇలా చేయడం ద్వారా మీరు వాటి దృష్టిని మరల్చవచ్చు. కుక్క మొరిగితే లేదా పరిగెత్తితే.. కూల్ గా ఉండమని లేదా నిశ్శబ్దంగా లేచి నిలబడమని ప్రేమగా అడగండి. కుక్కలకు మన ఎక్స్ ప్రెషన్స్ బాగా అర్థమవుతాయి. బైక్ ఫాలో అయ్యేట‌ప్పుడు మీరు స్పీడ్ పెంచొద్దు. నిదానంగా వెళితే అవి కొద్ది దూరం త‌ర్వాత ఆగిపోతాయి.

Share
Sunny

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM