మనం రక రకాల దోశలను వేసుకోవచ్చు. మినుములు, పెసలు, చిరు ధాన్యాలు.. ఇలా రక రకాల ధాన్యాలతో దోశలను వేసుకోవచ్చు. దోశలు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎంత ప్రయత్నించినా దోశలు బాగా రావడం లేదని కొందరు వాపోతుంటారు. మరి దోశలు బాగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పిండి మరీ మెత్తగా పట్టకుండా కాస్తా బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. దీంతో దోశలు బాగా వస్తాయి.
* పిండి మరీ గట్టిగా కలపకూడదు. కాస్తా పలచగా ఉంటేనే పేపర్ దోశ వస్తుంది.
* దోశలు వేసే కొన్ని నిముషాల ముందు పిండిలో ఓ పావు టీ స్పూను వంట సోడా, ఓ స్పూను చక్కెర కలపాలి. దీంతో దోశలు బాగా వస్తాయి.
* దోశలు వెయ్యడానికి కొన్నినిముషాల ముందు ఓ పిడికెడు అన్నం వేసి రుబ్బుకోవచ్చు. లేదా రెండు టీస్పూన్ల అటుకులు వేసి రుబ్బుకోవచ్చు. దీంతో దోశలు పర్‌ఫెక్ట్ గా వస్తాయి.
* దోశ పిండి పెనం మీద వేశాక మనం గరిటతో లేదా చిన్న గిన్నెతో ఆ పిండిని పెనమంతా విస్తరించేలా తిప్పుతాం. అయితే పిండిని గడియారం ముల్లు తిరిగే దశలో కాకుండా వ్యతిరేక దిశలో తిప్పాలి. దీంతో దోశలు బాగా వస్తాయి. కరకరలాడతాయి.
* దోశ పిండిలో కొద్దిగా మజ్జిగ వేసి దోశలు వేస్తే పుల్లగా ఉంటాయి. దోశలు పుల్లగా కావాలని కోరుకునే వారు ఇలా ట్రై చేయవచ్చు.
* దోశలు పుల్లగా రావాలంటే పిండిని బయటే ఉంచాలి. అప్పుడే బాగా పులుస్తుంది. దీంతో దోశలు పుల్లగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే పిండి పులియదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…