మంచు లక్ష్మి ఆహా యాప్ ద్వారా “ఆహా భోజనంబు”అనే వంటల కార్యక్రమం ద్వారా వంటలక్కగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పలు రకాల వంటలను చేయిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా ఇప్పటికే 2 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు.
ఇప్పటికే మొదటి ఎపిసోడ్ కు హీరో విశ్వక్ వచ్చి వింత ప్రయోగాలు చేసి ఎంతో సందడి చేశాడు. అదేవిధంగా రెండవ ఎపిసోడ్ కి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చే అభిమానులను బాగా సందడి చేశారు. ఇక శుక్రవారం తాజాగా మూడవ ఎపిసోడ్ ప్రసారమయింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. తరుణ్ భాస్కర్ తో మంచులక్ష్మి ఎంతో సందడి చేశారు.
ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ తాను ఒక మంచి భోజనప్రియుడని తెలిపారు.ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం పెళ్లిచూపులు అంతా భోజనం ఆధారంగానే తెరకెక్కించారు. నిజానికి పెళ్లి చూపులు సినిమాలో ముందుగా లక్ష్మి మంచుని కలిసి నటించాలని కోరారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో చేయలేదు. అయినా వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆహా భోజనంబు కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి తరుణ్ భాస్కర్ గురించి కొన్ని ఆసక్తికరమైన ఈ విషయాలను వెల్లడించారు. తరుణ్ భాస్కర్ ఇంస్టాగ్రామ్ లో వచ్చిన కామెంట్లు చూసి కూడా ఎంతో ఫీల్ అయ్యేవాడిని తన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నావా? అని అడగగా.. లేదు ఇప్పుడు అందరిని బ్లాక్ చేస్తూ వస్తున్నా అంటూ సమాధానమిచ్చారు. ఇలా వీరి వీరి మధ్య ఎంతో సరదాగా ఈ కార్యక్రమం కొనసాగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…