కొనేవాడు ఉండాలే గానీ.. ఎవరైనా సరే.. దేనికైనా మసి పూసి మారేడు కాయ చేసి దాన్ని లక్షల రూపాయలకు అమ్ముతారు. గతంలో ఇలాంటి సంఘటనలను అనేక సార్లు చూశాం. ఓ కంపెనీ రూ.30వేలకు బెల్ట్‌ను అమ్మగా, ఇంకో కంపెనీ సాధారణ లేడీస్ హ్యాండ్ బ్యాగులను రూ.1.50 లక్షలకు విక్రయిస్తూ అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే తాజాగా ఓ న్యూజిలాండ్ రిటెయిల్ సంస్థ నులక మంచాలను ఒక్కోటి ఏకంగా రూ.58వేలకు అమ్ముతూ మైండ్ బ్లాంక్ చేస్తోంది.
న్యూజిలాండ్‌కు చెందిన అన్నాబెల్స్ అనే హోమ్ డెకార్ స్టోర్ వారు తమ వెబ్‌సైట్‌లో మనం వాడే పాత తరం నులక మంచాలను ఒక్కోటి రూ.58వేలకు అమ్ముతున్నారు. కొన్ని మంచాలను అయితే ఒక్కోటి రూ.88వేలకు అమ్ముతుండడం విశేషం. వాటిని ఉత్తర భారతీయులు చార్పయ్ అని లేదా చోర్పే అని పిలుస్తారు. అదే పేరిట సదరు సంస్థ వారు ఆ మంచాలను అమ్ముతుండడం విశేషం.
If this is real #Indians can mint money in #Australia selling our old stuff – #Charpoy #CaneFurniture #Mora #ClothesHorses #ClayUtensils … pic.twitter.com/fnRaFuhdcI
— mainakde (@mainakde) October 5, 2017
మనకు మహా అయితే రూ.1000 లోపే ఒక పకడ్బందీ అయిన మంచం వస్తుంది. కానీ వారు ఏకంగా రూ.58వేల నుంచి రూ.88వేల వరకు ఒక్కో నులక మంచాన్ని అమ్ముతుండడం గమనార్హం. అయితే ఆ కంపెనీ ఇలా అమ్ముతుండడాన్ని చూసి భారత నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. నులక మంచాలకు అంతటి ధరా ? చాలా కామెడీగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. అవును.. నులక మంచాలు మనకు పాతవే. కానీ విదేశీయులకు అవి తెలియవు కదా. అందుకనే వారు అంతటి ధర పెట్టి మరీ వాటిని కొంటున్నారు.