హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరైనా సరే సహజంగానే లొట్టలేసుకుంటూ తింటారు. ఆ బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరతాయి. చికెన్, మటన్, వెజ్.. ఇలా ఏ వెరైటీని తీసుకున్నా హైదరాబాద్ స్టైల్‌లో చేస్తే ఆ బిర్యానీకి ఎవరైనా సరే ఫిదా కావల్సిందే. అయితే హైదరాబాద్ మాత్రమే కాదు, మన దేశంలో పలు ఇతర ప్రాంతాల్లోనూ బెస్ట్ బిర్యానీ లభిస్తుంది. వాటిని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఏయే ప్రాంతాల్లో అద్భుతమైన బిర్యానీ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కేరళలోని కోజికోడ్ (కాలికట్)లో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎటు చూసినా పచ్చని ప్రకృతి దర్శనమిస్తుంది. పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ లభించే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్‌లా రుచిని కలిగి ఉంటుంది. కనుక ఈ ప్రాంతానికి వెళితే ఆ బిర్యానీని కచ్చితంగా టేస్ట్ చేయండి.
2. కేరళలోని కొచ్చిలోనూ అనేక అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ లభించే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది.
3. ఒడిశాలోని కటక్‌లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ లభించే బిర్యానీ ఎంతో టేస్ట్‌ను కలిగి ఉంటుంది.
4. కేరళలోని వయనాడ్‌లో పచ్చని వాతావరణం, అడవులు, వన్యప్రాణులు దర్శనమిస్తుంటాయి. ఇక్కడ బిర్యానీ లభిస్తుంది. కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన బిర్యానీ అది.
5. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అనేక చోట్ల లభించే బిర్యానీని చాలా మంది ఇష్టంగా తింటుంటారు.
6. వెస్ట్‌బెంగాల్ రాష్ట్రంలో ఉన్న అసన్‌సోల్ లో పర్యాటక ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ లభించే బిర్యానీ ఎంతో ఫేమస్. చాలా మంది తింటారు.
7. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ రకరకాల వంటకాలు పర్యాటకులకు లభిస్తాయి. అలాగే బిర్యానీ కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని ఒక్కసారి కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే.
8. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండే ఆగ్రాలోనూ బిర్యానీ లభిస్తుంది. అది ఎంతో రుచిగా ఉంటుంది. అక్కడికి వెళ్లినప్పుడు ఆ బిర్యానీని ఒక్కసారి రుచి చూడండి.
9. కర్ణాటకలోని మైసూర్ లో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రదేశంలోనూ బిర్యానీ లభిస్తుంది. అది భలే రుచిగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…