ఆఫ్‌బీట్

News Paper Dots : న్యూస్ పేప‌ర్ల‌పై 4 రంగుల్లో ఉండే ఈ చుక్క‌లు.. ఎందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా..?

News Paper Dots : న్యూస్ పేప‌ర్ల‌ను చ‌దివే అల‌వాటు మీకుందా..? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే స‌మాచారం కూడా న్యూస్ పేప‌ర్స్ గురించే. అంటే.. అందులో రాసే వార్త‌లు, ఇత‌ర‌త్రా విష‌యాల గురించి కాదు. కానీ.. అది మ‌నం తెలుసుకోవాల్సిన విష‌య‌మే. ఇంత‌కీ ఏంటా విష‌యం..? అంటారా..! ఏమీ లేదండీ…! న్యూస్ పేప‌ర్లపై మీరు ఎప్పుడైనా నాలుగు క‌ల‌ర్ చుక్క‌లు లేదా అదే రంగులో ఉండే వేరే ఏవైనా సింబ‌ల్స్ చూశారా..? చూసే ఉంటారు, కానీ వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకుని ఉండ‌రు. స‌హ‌జంగా ఆ నాలుగు డాట్స్ క‌ల‌ర్ పేజీల‌పై మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అయితే.. అస‌లు అలా ఆ నాలుగు చుక్క‌లు న్యూస్ పేప‌ర్ల‌పై ఎందుకు ప్రింట్ అయి వ‌స్తాయో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా మ‌నం చిన్న‌పాటి ప్రింట‌ర్‌లో ఏదైనా పేజీ ప్రింట్ తీస్తే ఆ ప్రింట‌ర్‌ పేజీ సైజ్‌కి అనుగుణంగా అక్ష‌రాల‌ను ఒక స్టైల్‌లో, క్ర‌మ‌బ‌ద్ద‌మైన కొల‌త‌ల‌తో ప్రింట్ చేస్తుంది క‌దా. దాని అలైన్‌మెంట్ (అమ‌రిక‌) ప్ర‌కారం ప్రింట‌ర్ అలా పేజీల‌ను ప్రింట్ చేస్తుంది. అంటే.. అక్ష‌రాలు లేదా ఫొటోలు బ్ల‌ర్‌గా రావ‌డం లేదంటే మ‌నం పేజీలో పెట్టిన మార్జిన్స్ కాకుండా టెక్ట్స్ అడ్డ దిడ్డంగా ప్రింట్ అవ‌డం.. అన్న‌మాట‌. అలా రాకుండా ఉండేందుకు ఏ ప్రింట‌ర్ అయినా ముందు అలైన్‌మెంట్ చేసుకుంటుంది. స‌రిగ్గా ఇదే సూత్రం న్యూస్ పేప‌ర్ ప్రింటింగ్‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఏదైనా క‌ల‌ర్ పేజీలో టెక్ట్స్ లేదా ఫొటోను అలైన్‌మెంట్ ప్ర‌కారం ప్రింట్ చేయాలంటే అందుకు పైన చెప్పిన ఆ నాలుగు డాట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

News Paper Dots

నిజానికి ఆ నాలుగు డాట్స్ నాలుగు క‌ల‌ర్ల‌లో ఉంటాయి. అవే సీఎంవైకే (CMYK). అంటే క్యాన్‌, మెజెంటా, ఎల్లో, బ్లాక్ అని అర్థం. ఈ నాలుగు క‌ల‌ర్స్ ప‌లు ర‌కాలుగా మిక్స్ అయి కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌ల‌ర్స్‌ను సృష్టిస్తాయి. అందుకే ఈ రంగుల‌ను ప్రాథ‌మిక రంగులు అని కూడా పిలుస్తారు. ఈ క్ర‌మంలో ఈ నాలుగు క‌ల‌ర్స్‌కు చెందిన చుక్క‌లు ఉండ‌డం వ‌ల్ల న్యూస్ పేప‌ర్ ప్రింటింగ్ మెషిన్లు అలైన్‌మెంట్‌ను స‌రిగ్గా తీసుకుని.. టెక్ట్స్‌, ఫొటోల‌ను స‌రిగ్గా ప్రింట్ చేస్తాయి. అదే అలైన్‌మెంట్ స‌రిగ్గా లేద‌నుకోండి.. టెక్ట్స్‌, ఫొటోలు బ్ల‌ర్‌గా వ‌స్తాయి. స‌రిగ్గా క‌నిపించ‌వు. దాన్ని బ‌ట్టి మ‌న‌కు సుల‌భంగా అర్థ‌మ‌వుతుంది, ఆ ప్రింట్ మెషీన్ స‌రిగ్గా అలైన్‌మెంట్ చేసుకోలేద‌ని.

ఒక్కో సారి మ‌న‌కు అలా అలైన్‌మెంట్ స‌రిగ్గా చేయ‌బ‌డ‌ని కొన్ని పేజీలు కూడా క‌నిపిస్తుంటాయి కదా. అందుకు కార‌ణం అదే. దీంతోపాటు ఆ నాలుగు డాట్స్‌ను మెషిన్లు గుర్తించి స‌రైన రంగుల‌ను మిక్స్ చేసేందుకు కూడా ఆ డాట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఇవి బుక్స్‌ల‌లో కూడా ఉంటాయి. కాక‌పోతే బుక్స్‌ను చాలా త‌క్కువ సంఖ్య‌లో ప్రింట్ చేస్తారు, దానికి తోడు వాటిని బైండింగ్ కూడా చేస్తారు క‌నుక, ఆ నాలుగు డాట్స్ క‌ట్ అవుతాయి. అదే న్యూస్ పేప‌ర్ల‌ను అలా చేయ‌లేం క‌దా. అందుకే ఆ నాలుగు చుక్క‌లను అలాగే వ‌దిలేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అవి అలా క‌నిపిస్తాయ‌న్న‌మాట‌.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM