Yawning : మానవ శరీరమే ఓ చిత్రమైన నిర్మాణం. ఎన్నో లక్షల కణాలు, కణజాలాలతో నిర్మాణమైంది. ఎన్నో అవయవాలు వాటి విధులు నిత్యం నిర్వర్తిస్తుంటాయి. ఈ క్రమంలో మనం మనకు తెలియకుండానే శరీరం ద్వారా కొన్ని సహజమైన ప్రక్రియలను రోజూ ఆయా సందర్భాల్లో నిర్వహిస్తుంటాం. అలాంటి వాటిలో ఒకటే ఆవులింత. అయితే అసలు ఆవులింతలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా..?
శరీరం బాగా అలసిపోయినప్పుడు, తగినంత నిద్ర పోనప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఈ క్రమంలో ఆ ఆక్సిజన్‌ను భర్తీ చేసేందుకు గాను ఆవులింతలు వస్తాయి. ఆవులింత వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో గాలి మన శరీరం లోపలికి వెళ్తుంది. దీని వల్ల మనకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. అనంతరం అదే మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల మన శరీరం రిలాక్స్ అయి ఉత్తేజంగా ఉంటుంది. అయితే ఆవులింత తీసే సమయంలో మన కళ్ల నుంచి నీరు ఎందుకు వస్తుందో మీకు తెలుసా..?
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆవులింతలు తీసినప్పుడు కళ్ల నుంచి నీరు వస్తుందనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే అలా నీరు రావడం వెనుక ఉన్న విషయం మాత్రం అది కాదు. ఆవులింత తీసినప్పుడు కళ్లు మూసుకుంటాం కదా. అలా మూసుకున్నప్పుడు కంటి రెప్పలు ముక్కు పై భాగం పక్కన కలుసుకునే punctum అనే పాయింట్ lacrimal గ్రంథులపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ క్రమంలో కంటి పై రెప్పలు దగ్గరకు ముడుచుకుని కంట్లో నుంచి నీటిని బయటకు పంపిస్తాయి. అందుకే మనం ఆవులింత తీసినప్పుడు కళ్ల నుంచి నీరు వస్తుంది. అయితే ఇలా జరగడం అత్యంత సహజమైన ప్రక్రియే. దీని వల్ల మనకు ఎలాంటి హాని లేదు. కళ్లు పొడిబారకుండా ఉండేందుకే అలా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు మీరు ఆవులింత తీసినప్పుడు కళ్ల నుంచి నీరు వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…