Walnuts : వాల్‌నట్స్ గురించి అందరికీ తెలిసిందే. వాల్ నట్స్ మనకు సాధారణంగా రెండు రకాలుగా లభిస్తాయి. పొట్టు తీసినవి, పొట్టు తీయనివి. పొట్టు తీయని వాల్ నట్స్‌ను సాధారణంగా ఎవరూ ఉపయోగించరు. ఎందుకంటే వాటి మీద ఉండే టెంకను పగలగొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే కింద ఇచ్చిన వీడియోను మీరు ఒక్కసారి చూడండి చాలు.. ఈయన ఏకంగా అలాంటి వాల్ నట్స్‌ను తన మోచేత్తోనే కొన్ని సెకన్లలోనే పగలగొట్టాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ రషీద్ అనే వ్యక్తి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ వాల్ నట్స్‌ను పగలగొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. ఈ ఫీట్‌ను ఈయన ఈ ఏడాది మే 18న సాధించాడు. ఈయన 30 సెకన్లలోనే మోచేత్తో ఏకంగా 169 వాల్ నట్స్‌ను పగలగొట్టి రికార్డు సృష్టించాడు. అయితే గతంలోనూ ఈయన పేరిట పలు రికార్డులు ఉండడం విశేషం.

2021లో మహమ్మద్ రషీద్ 1 నిమిషంలో 315 వాల్ నట్స్‌ను పగలగొట్టి అప్పట్లో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. తరువాత మళ్లీ 2023 సెప్టెంబర్ 17న 329 వాల్ నట్స్‌ను ఒక నిమిషంలోనే పగలగొట్టి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది మేలో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇందుకు తాను ఎంతో కష్టపడ్డానని రషీద్ తెలిపాడు.
గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. నేను రోజూ వాల్ నట్స్‌ను చేతుల్తో పగలగొట్టడం ప్రాక్టీస్ చేశా. రోజూ కనీసం 4 నుంచి 5 గంటలు అయినా ఇందుకు కేటాయిస్తా. నేను క్రియేట్ చేసిన రికార్డును కొందరు బద్దలు కొట్టారు. అందుకని మళ్లీ మళ్లీ ఆ రికార్డును నా పేరిటే ఉండేలా చూస్తున్నా. ఇందుకు చాలా కష్టపడుతున్నా.. అని రషీద్ తెలిపాడు. అయితే ఈయన వాల్ నట్స్‌ను పగలగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మీరూ ఆ వీడియోను చూసేయండి.
View this post on Instagram