టెక్నాలజీ ప్రస్తుతం ఎంతగానో మారింది. అయినప్పటికీ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా తగ్గలేదు. తమకు కుమార్తె వద్దని, కొడుకే కావాలని చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. కానీ కుమార్తె అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అని, ఆమె పుడితే సంతోషించాలని కొందరు చాటి చెబుతున్నారు. ఆ వ్యాపారి కూడా అలాగే చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మధ్యప్రదేశ్‌లోని కోలార్ అనే ప్రాంతానికి చెందిన ఆంచల్ గుప్తా 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. గత 20 ఏళ్లుగా పానీ పూరీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఇటీవల కుమార్తె జన్మించింది. దీంతో తనకు లక్ష్మీదేవి పుట్టిందని అతను సంతోషిస్తూ ఆదివారం అతను రూ.40వేల విలువ చేసే పానీ పూరీలను జనాలకు ఉచితంగా పంపిణీ చేశాడు. అందరూ అతనికి కుమార్తె పుట్టినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా ఆంచల్ గుప్తా మాట్లాడుతూ తనకు ఎల్లప్పుడూ కుమార్తె కావాలని ఉండేదని, అయితే మొదటి సంతానంగా కొడుకు పుట్టాడని తెలిపాడు. కానీ రెండో సంతానంగా కుమార్తె జన్మించిందని, తాను అనుకున్న విధంగా జరిగిందని, అందుకనే సంతోషంతో పానీ పూరీలను పంపిణీ చేశానని తెలిపాడు. కాగా ఆంచల్ గుప్తాకు చెందిన ఇద్దరు సోదరులు ఇంజినీర్లుగా స్థిర పడ్డారు. ఈయన మాత్రం పానీ పూరీ వ్యాపారం చేస్తున్నాడు. కానీ గుప్తా భార్య డిగ్రీ చదివింది. దీంతో వారు సొంతంగా టైలరింగ్ వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నారు. తమకు కుమార్తె పుట్టినందుకు అతను పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…