Hyderabad Irani Chai : హైదరాబాద్ నగరం అనేక చారిత్రక స్థలాలు, పర్యాటక ప్రాంతాలు, వస్తువులకే కాదు.. పలు ఆహార పదార్థాలకు కూడా ఫేమస్సే. వాటిలో చెప్పుకోదగినవి రెండు. ఒకటి హైదరాబాద్ బిర్యానీ. రెండు ఇరానీ చాయ్. రెండూ భాగ్యనగరంలో ఫేమస్సే. బిర్యానీని ఆరగించేందుకు మన నగరంలో లెక్కలేనని హోటల్స్ ఉన్నాయి. కానీ కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు అసలు సిసలైన హైదరాబాద్ బిర్యానీ లభిస్తుంది. అలాగే ఇరానీ చాయ్ కూడా. దీన్ని కింద చెప్పిన పలు హోటల్స్‌లో ఎంజాయ్ చేసి చూడండి. ఆ తరువాత మీరు ఇరానీ చాయ్‌కి ఫిదా అయిపోతారు. మరి హైదరాబాద్‌లో బెస్ట్ ఇరానీ చాయ్ లభించే ఆ హోటల్స్, ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
బ్లూ సీ కేఫ్, సికింద్రాబాద్.. సికింద్రాబాద్ వెళ్తే ఇక్కడి బ్లూ సీ కేఫ్‌లో ఇరానీ చాయ్ టేస్ట్ మరువకండి. అంతలా బాగుంటుంది. అలాగే నాంపల్లిలో ఉన్న కేఫ్ నీలోఫర్ అండ్ బేకర్స్ కేఫ్‌లో ఇరానీ చాయ్ తాగితే అదిరిపోయే టేస్ట్ లభిస్తుంది. పాతబస్తీలో ఉన్న షాదాబ్ హోటల్‌లో ఒక్క సారి ఇరానీ చాయ్ టేస్ట్ చూస్తే దాన్ని మీరు విడిచిపెట్టరు. బంజారాహిల్స్‌లో ఉండే లామకాన్‌లోనూ మనకు బెస్ట్ ఇరానీ చాయ్ దొరుకుతుంది. హైదర్‌గూడలో ఉన్న కేఫ్ బహార్ ఇరానీ చాయ్‌కు పెట్టింది పేరు.
బంజారా హిల్స్ లోని సర్వి హోటల్ లో ఉండే సర్వి బేకర్స్‌లో ఇరానీ చాయ్ తాగి తీరాల్సిందే. అలాగే ఘన్సీ బజార్‌లోని హోటల్ నయాబ్ కూడా ఇరానీ చాయ్‌కు ఫేమస్సే అని చెప్పవచ్చు. ఇక పాతబస్తీలోని చార్మినార్ దగ్గర ఉండే నిమ్రా కేఫ్ అండ్ బేకరీలోనూ బెస్ట్ ఇరానీ చాయ్ లభిస్తుంది. మసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న తైబా బేకరీ అండ్ కేఫ్ లో ఇరానీ చాయ్ లభిస్తుంది. టోలిచౌకిలో ఉన్న రుమాన్ కేఫ్‌లోనూ మనకు బెస్ట్ ఇరానీ చాయ్ లభిస్తుంది. ఇలా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మనకు బెస్ట్ ఇరానీ చాయ్ లభిస్తుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. బాగుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…