శ్మశానాలు అంటే సహజంగానే చాలా మందికి భయం కలుగుతుంది. అక్కడ ఎక్కువ సేపు ఉండలేరు. అయితే సమాధులను సందర్శించేందుకు మాత్రం కొందరు శ్మశానాలకు వెళ్తుంటారు. తమ ఆత్మీయుల సమాధుల వద్ద పువ్వులు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి కాసేపు ఉండి వస్తుంటారు. ఇలా ఒక వ్యక్తి కూడా ఓ శ్మశానవాటికకు వెళ్లాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కాలిఫోర్నియాలోని సాక్రమెంటో అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాథలిక్ శ్మశానవాటికలో తన ఆత్మీయులకు చెందిన సమాధులను చూసేందుకు 37 ఏళ్ల జోయెల్ మోరిసన్ అనే వ్యక్తి వెళ్లాడు. అయితే అక్కడ కొన్ని సమాధుల నుంచి మృతదేహాలకు చెందిన వెంట్రుకలు బయటకు వచ్చి కనిపించాయి. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురై తీవ్రంగా భయ పడ్డాడు. తరువాత తేరుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని అతను అక్కడి నిర్వాహకులకు చెప్పాడు. దీంతో అలా ఎందుకు జరుగుతుందో వారు పరిశీలిస్తున్నారు. అక్కడ పురాతన వృక్షాలు కొన్ని ఉన్నాయని వాటి వేర్ల వల్ల సమాధులు దెబ్బ తింటున్నాయని, అలాగే క్రూర జంతువులు కూడా సంచరిస్తున్నాయని అందుకే సమాధులు అలా అవుతున్నాయని భావిస్తున్నారు. కానీ కచ్చితమైన ఆధారాలు లభించడం లేదు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…