ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తే కొన్ని ప్రేక్షకులకు నచ్చవు. కానీ కొన్ని మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. అందువల్ల రీమేక్ అయినప్పటికీ ప్రేక్షకులకు కొన్ని నచ్చుతాయి. గతంలో పలు తెలుగు మూవీలు ఇలాగే హిట్ అయ్యాయి. అయితే హిందీ మూవీ అంధాధున్‌కు రీమేక్‌గా వచ్చిన నితిన్ మ్యాస్ట్రో మూవీ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ? అన్న విషయానికి వస్తే..
కథ..
అరుణ్ (నితిన్) ఒక పియానో వాయిద్యకారుడు. అతను కొన్ని కారణాల వల్ల అంధుడిగా నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను సిమ్రన్ (తమన్నా), సీఐ బాబీ (జిష్షు సేన్‌గుప్తా)లు అనుకోకుండా చేసిన ఓ హత్యను చూస్తాడు. కానీ అంధుడిగా నటిస్తుండడం చేత అతను చూసిన హత్యను ఎవరికీ చెప్పలేడు. ఏమైతే అదైందని పోలీస్ స్టేషన్‌కు కూడ వెళ్తాడు. అక్కడ మర్డర్ రిపోర్టు ఇవ్వాలని చూస్తాడు. తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అరుణ్ ఏ విధంగా ఈ సమస్య నుంచి బయట పడ్డాడు ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మూవీలో నటులందరూ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. తమన్నా భర్తగా నరేష్ కొంత సేపు కనిపించినా ఆయన నటన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగిలిన నటులు కూడా ఫర్వాలేదనిపించారు. అయితే తమన్నా ఈ మూవీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. కనుక ఆమె డైలాగ్స్‌ను వినేందుకు కొద్దిగా కష్టపడాలి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా బాగానే ఉంది.
హిందీ మూవీ అంధాధున్ లోని కథను దర్శకుడు మేర్లపాక గాంధీ యథావిధిగా తీసుకున్నాడు. అందువల్ల కథ అలాగే కొనసాగుతుంది. చిన్న చిన్న మార్పులు చేశారు. అయినప్పటికీ సస్పెన్స్‌గా కథనం సాగుతుంది. అయితే హిందీ మూవీ చూసిన వారికి మ్యాస్ట్రో పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ హిందీ మూవీని చూడకుండా ఈ మూవీనే నేరుగా చూసే వారికి కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఒక భిన్న కథాంశం కనుక ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. ఒక్కసారి ఈ మూవీని చూడవచ్చు.
రేటింగ్ – 3.5/5
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…