Auto Driver : మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆటోలను ఎక్కే ఉంటారు. కొంత మందికి సొంత వాహనాలు ఉంటాయనుకోండి, అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో వారు ఆటోలలో ప్రయాణించే ఉంటారు. దీనికి తోడు ఇంకొంత మందైతే నిత్యం ఆటోల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే మీరెప్పుడైనా ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ డ్రైవర్ సీటుపై ఎక్కడ కూర్చుంటున్నాడో జాగ్రత్తగా పరిశీలించారా..? ఆ, అదే.. సీటుకి చివరిగా, కుడి లేదా ఎడమ వైపులకు కూర్చుని ఆటోలను నడుపుతుంటారు. అయితే వారు సీటు మధ్యలో ఎందుకని కూర్చోరు..? ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం రండి.
ఆటోడ్రైవర్లు తమ తమ వాహనాల్లో సీట్ అంచుకే ఎందుకు కూర్చుంటారో ప్రధానంగా కొన్ని కారణాల వల్ల చెప్పవచ్చు. సాధారణంగా ఆటో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో నేర్పించే వ్యక్తి డ్రైవర్ పక్కనే ఉంటాడు కాబట్టి ఆ డ్రైవర్ సీట్ చివరికి కూర్చోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అదే అలవాటుగా మారి డ్రైవర్ ఎల్లప్పుడూ సీట్‌కి చివరిగా కూర్చునేలా చేస్తుంది.

పాత తరం ఆటోల్లో ఇంజిన్లు సీటు కిందే ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు ఇంజిన్ నుంచి వచ్చే హీట్‌ను తట్టుకునేందుకు సీట్ చివరికి కూర్చుంటారు. ఇదే సందర్భంలో వారు అప్పుడప్పుడు తమ స్థానాలను కూడా మారుస్తారు. సీట్ చివరికి కూర్చోవడం వల్ల వాహనంలో మరో ఇద్దరు, ముగ్గుర్ని ఎక్కించుకునేందుకు వీలవుతుంది. అందుకనే వారు అలా సీటు చివర్లో కూర్చుంటారు.
ప్రధానంగా ఆటోలో సీట్‌పై కుడివైపు చివరి భాగంలో కూర్చుంటే వాహనాన్ని సులభంగా టర్న్ చేయవచ్చట. అంతేకాదు కుడివైపు వచ్చే వాహనాలను అద్దంలో సులభంగా చూడవచ్చట. అవతల వచ్చే వాహనదారులతో సులభంగా మాట్లాడవచ్చట. అందుకనే ఆటో డ్రైవర్లు ఆటోల్లో సీటుకు చివరి భాగంలో కూర్చుంటారు. ఇవీ.. దాన వెనుక ఉన్న కారణాలు.