ఆఫ్‌బీట్

మరణించిన తరువాత కూడా మన శరీరంలో కొన్ని అవ‌య‌వాలు ప‌నిచేస్తూనే ఉంటాయి తెలుసా..?

మృత్యువు.. మనిషిగా పుట్టిన తరువాత దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కరు, ఆ మాట కొస్టే ప్రతీ జీవి చావాల్సిందే. కానీ ఒకరు ముందు, ఒకరు తరువాత. అయితే చనిపోయిన తరువాత మన శరీరానికి ఏం జరుగుతుంది..? సాధారణంగా అవయవాలేవీ పనిచేయవు, అని అందరూ భావిస్తారు. కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉందా..? అయితే వాటి గురించి తెలుసుకోండి.

మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బాక్టీరియా బతికే ఉంటుంది. అది జీర్ణాశయం, పేగుల్లో తిరుగుతూ ఉంటుంది. అయితే శరీరంలో చెడు గ్యాస్ తయారయ్యే కొద్దీ ఆ బాక్టీరియా క్రమంగా బయటికి వెళ్లిపోతుంది. మన శరీరంలో జరిగే శ్వాసక్రియ, గుండె కొట్టుకోవడం వంటి పనులను నియంత్రించే మెదడులోని ఓ భాగం మూత్ర విసర్జనను కూడా నియంత్రిస్తుంది. మూత్ర విసర్జన అనేది ఒక అసంకల్పిత చర్య. అయితే మనిషి చనిపోయాక అతని మెదడు పనిచేయడం కూడా ఆగిపోతుంది. దీంతో మూత్రాశయానికి సంబంధించిన కొన్ని కండరాలు వ్యాకోచింపబడతాయి. ఈ నేపథ్యంలోనే మనిషి చనిపోయిన తరువాత ఒక్కోసారి మూత్రం వస్తుంది.

తీవ్ర ఒత్తిడిలో ఉండే శరీరం వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేస్తుంది. మనిషి మరణం తరువాత ఉత్పన్నమయ్యే గ్యాస్ శరీరంలోని మలాన్నంతటినీ బయటికి పంపివేసేందుకు ప్రయత్నిస్తుంది. చనిపోయాక కూడా ఒక్కోసారి ఇలా మలం బయటికి విసర్జించబడుతుంది. మనిషి చనిపోయాక అతని స్వర పేటిక కూడా కొంత సేపు పనిచేస్తుంది. అదెలాగంటే శరీరంలో గ్యాస్ ఉత్పన్నమయ్యే క్రమంలో ఊపిరితిత్తులు ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడక్కడ నిండిన గ్యాస్ నోటి ద్వారా బయటకు వస్తుంది. అదే సమయంలో చిన్నపాటి శబ్దం కూడా గొంతు నుంచి వినిపిస్తుంది.

శ్వాస, గుండె కొట్టుకోవడం ఆగిపోయి మనిషి మరణించినా దాని తరువాత కొన్ని నిమిషాల పాటు మెదడు పనిచేస్తుంది. అప్పుడది మనల్ని బతికించేందుకు ప్రయత్నిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్, ఇతర పోషకాలను గ్రహిస్తూ మనల్ని బతికి ఉంచేలా చేస్తుంది. ఈ సమయంలో సరైన మందులు ఇస్తే ఒక్కోసారి బతికేందుకు అవకాశం ఉంటుంది. అదంతా వైద్యుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అయినా ఇలాంటి సందర్భాల్లో చాన్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. మనిషి చనిపోయాక అతని శరీరం బిగుసుకునిపోయి కండరాలు సంకోచించుకుంటాయి. అయితే కొన్ని కండరాలు మాత్రం పనిచేస్తాయి. వీటి పనితనం వెనుక మెదడు ఆధార పడి ఉండదు. ఈ నేపథ్యంలోనే శరీరంలోని కొన్ని జాయింట్లు, కండరాల కదలికలను మనం పరిశీలించవచ్చు. చేతులు, కాళ్ల వంటి భాగాల్లో దీన్ని మనం గమనించవచ్చు. ఇదెలా ఉంటుందంటే చూసే వారికి ఆ మనిషి బ్రతికి ఉన్నాడేమోనని భ్రమ కలుగుతుంది. ఆ రీతిలో కండరాలు అటు ఇటు కదులుతాయి.

చనిపోయిన మనిషికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కొన్ని సార్లు ఎరెక్షన్ (అంగ స్తంభన) సంభవిస్తుంది. ఇది సాధారణమే. నిట్టనిలువుగా కుప్ప కూలి వ్యక్తులు చనిపోతే ఇలా జరుగుతుంది. మనిషి మరణించిన తరువాత అతని చర్మ కణాలు ఎక్కువ కాలం వరకు బతికే ఉంటాయి. శరీరం నుంచి ఆక్సిజన్ అందకపోయినా బాహ్య ప్రపంచం నుంచి గాలిని తీసుకున్న చర్మం ఎక్కువ రోజుల వరకు జీవించే ఉంటుంది. గర్భంతో ఉన్న మహిళ చనిపోతే ఆమె శరీరంలో గ్యాస్‌లు ఉత్పన్నమై గర్భంలో ఉన్న బిడ్డను బయటకు పంపుతాయి. మనిషి చనిపోయిన తరువాత అతని వెంట్రుకలు, గోళ్లు మాత్రం పెరుగుతూనే ఉంటాయని అనుకుంటారు. కానీ తేమ కోల్పోయిన చర్మం ముడుచుకుపోవడం వల్ల గోర్లు, వెంట్రుక‌లు పైకి వ‌స్తాయి. దీంతో అవి పెరిగిన‌ట్లు భ్ర‌మ క‌లుగుతుంది. కానీ వాస్త‌వానికి మ‌నిషి చ‌నిపోయాక గోర్లు, వెంట్రుక‌లు పెర‌గ‌వు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM