ఆధ్యాత్మికం

Fasting : ఉపవాసం ఉండడం మంచిదేనా..? ఉప‌వాసం ఉంటే ఏం జ‌రుగుతుంది..?

Fasting : ఇష్టం దైవం పేరిట వారంలో నిర్దిష్టమైన రోజునో, శివరాత్రి వంటి పర్వదినాల్లోనో, ఇతర వ్రతాలు, పూజలు చేసినప్పుడో హిందువుల్లో అధిక శాతం మంది దేవుడికి ఉపవాసం ఉంటారు. ఇది చాలా సహజం. ఆ మాటకొస్తే ముస్లింలు కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా..? అంటే.. మంచిదే.. అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర అని, వాస అంటే ఉండడం అని అర్థం. వెరసి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఒకప్పుడు ప్రజలు ఆహారాన్ని సంపాదించడం, దాన్ని వండుకోవడం, తినడం, జీర్ణం చేసుకోవడం వంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారించేవారు. ఈ నేపథ్యంలోనే వారు శారీరకంగా అలసిపోవడంతోపాటు మానసిక ఏకాగ్రత ఉండేది కాదు. దీన్ని అధిగమించేందుకే వారు తక్కువ మొత్తంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లేదా అసలు ఆహారానికే దూరంగా ఉండడమో చేసే వారు. దీంతో శరీరం తేలిగ్గా అనిపించి మనసు కూడా ప్రశాంతమయ్యేది. దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ఇది వారికి ఎంతగానో ఉపయోగపడేది.

Fasting

ఆహారం తినకుండా అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. దీంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేసేందుకు వీలవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

ఉపవాసంపై భగవద్గీతలో కూడా పలు అంశాలు పేర్కొనబడ్డాయి. ఉపవాసం అనేది ఒక వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ఉండాలని, ఎవరూ ఈ విషయంలో బలవంతం చేయవద్దని గీత సారాంశం. అంతేకాదు శరీరం మరీ నీరసించి అనారోగ్యం కలిగేంతలా కూడా ఉపవాసం చేయకూడద‌ట‌. ఉపవాసంలో ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM