Youtuber Sreekanth Reddy : యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి.. ఇప్పుడు ఈయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఈయనకు, నటి కరాటే కల్యాణికి మధ్య జరిగిన గొడవ గురించే చర్చించుకుంటున్నారు. వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా.. కొన్ని ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టారు. అయితే కరాటే కల్యాణి సినిమాల్లో నటించింది కనుక తెలుగు ప్రేక్షకులకు ఆమె తెలుసు. కానీ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గురించి తెలియదు. అయితే ఈ గొడవ కారణంగా ఈయన అంటే తెలియని వారికి కూడా తెలిసిపోయింది. దీంతో ఈయన చేసిన ప్రాంక్ వీడియోలను చూసేందుకు వారు ఆసక్తిని చూపిస్తున్నారు.
యూట్యూబ్‌లో ప్రస్తుతం అనే మంది చానల్స్ ఏర్పాటు చేసి డబ్బులు గడిస్తున్నారు. అయితే శ్రీకాంత్ రెడ్డి కూడా అలాగే చానల్ పెట్టాడు. కానీ ఆయన వెరైటీగా ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడు. సాధారణంగా మనం బయట రోడ్డుపై వెళ్లే అపరిచిత వ్యక్తులతో కొంచెం భిన్నంగా లేదా.. అమ్మాయిలు, ఆంటీలతో రొమాంటిక్‌గా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది ? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. కానీ శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఇందులోంచి కాన్సెప్ట్ ను మాత్రమే ఎంచుకున్నాడు. మొత్తం సెటప్ చేసిందే. రోడ్డుపై వెళ్లే అపరిచిత వ్యక్తులతో అలా ప్రవర్తించలేం. కనుక ముందుగానే ఇలా చేయాలని చెప్పి అంతా సిద్ధం చేస్తాడు. తరువాత ఆ వీడియోను షూట్ చేసి అప్ లోడ్ చేస్తాడు. దీంతో రియల్‌గా మాట్లాడినట్లే అనిపిస్తుంది. ఎక్కడ కూడా అది యాక్షన్ అన్న విషయం తెలియదు. ఇలా అతని ప్రాంక్ వీడియోలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ వీడియోలను చూసేందుకు చాలా మంది అతని గురించి సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.

ఇక శ్రీకాంత్ రెడ్డి వీడియోల్లో చాలా వరకు అమ్మాయిలు, ఆంటీలతో చేసిన ప్రాంక్ వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. వారి దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడడం.. లవర్స్ మాట్లాడినట్లు ప్రశ్నలు అడగడం.. వారు స్పందించడం.. ఇలా చాలా రకాల వీడియోలు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. అవన్నీ ప్రాంక్ వీడియోలే అన్న విషయం స్పష్టమవుతోంది. అలాగే డబ్బులిచ్చి వాటిని షూట్ చేస్తున్నట్లు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. లేదంటే ప్రాంక్ వీడియోలను రోడ్డు మీద జనాలతో చేస్తే ఈపాటికే ఆయన జైల్లో ఉండేవాడు. ఏది ఏమైనా.. కరాటే కల్యాణి మూలంగా ఇప్పటి వరకు తెలియని వారికి కూడా శ్రీకాంత్ రెడ్డి ఎవరో తెలిసిపోయింది. ఇది ఆయనకు ప్లస్ పాయింటే అయిందని చెప్పవచ్చు.
https://youtu.be/GPaL-C7SD14