Bahubali : బాహుబ‌లి సినిమాను చాలా సార్లు చూసి ఉంటారు.. కానీ దీన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..?

Bahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి మూవీ ఎంత‌టి హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వ‌చ్చి అల‌రించింది. రెండో పార్ట్ అత్య‌ధిక స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను సృష్టించి భారతీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇందులో ముఖ్యంగా క‌ట్ట‌ప్ప అస‌లు బాహుబ‌లిని ఎందుకు చంపాడు.. అనే విష‌యాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఈ మూవీని వీక్షించారు. ఈ మూవీ విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. అయితే ఈ మూవీని ఇప్ప‌టికే మ‌నం చాలా సార్లు చూశాం. కానీ ఇందులో ఉన్న చిన్న చిన్న త‌ప్పుల‌ను మ‌నం అప్పుడ‌ప్పుడు గ‌మ‌నిస్తుంటాం. అలాంటి ఒక త‌ప్పు గురించే ఇప్పుడు చెప్ప‌బోయేది. ఇంత‌కీ అదేమిటంటే..

Bahubali

బాహుబ‌లి మూవీ మొద‌టి పార్ట్‌లో ఆరంభంలో శివుడు అవంతిక‌ను వెదుక్కుంటూ వెళ‌తాడు. ఓ ద‌శ‌లో ఇద్ద‌రూ క‌లుసుకుని ద‌గ్గ‌ర‌వుతారు. ఆ స‌మ‌యంలో వారు శారీర‌కంగా ఒక్క‌ట‌వుతారు. దీన్ని ద‌ర్శ‌కుడు పాట‌లో చూపించారు. ప‌చ్చ బొట్టేసినా అనే పాట‌లో ఇదంతా జ‌రుగుతుంది. అయితే అదే పాట‌లో చివ‌ర్లో నీలం రంగు దుస్తులు ధ‌రించిన అవంతిక ఎద‌ వ‌స్త్రం వెనుక వైపు ముందుగా ముడి ఉండ‌దు. పాట‌లో దాన్ని స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు. కానీ ఇంకో సీన్‌లో అదే వ‌స్త్రానికి ఆమె ముడి విప్పుతుంది. దాన్ని ఆమె వెనుక నుంచి చూడ‌వ‌చ్చు. ఇది సినిమాలో చాలా చిన్న మిస్టేక్‌. కానీ దీన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు.

ఇలా సినిమాల్లో దుస్తుల విష‌యంలో పొర‌పాట్లు జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే. దీన్ని చాలా మంది గ‌మ‌నించ‌రు. కానీ చాలా ఎక్కువ సార్లు ఏదైనా మూవీని చూస్తే అందులో ఉండే చిన్న చిన్న త‌ప్పులు కూడా మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. వాటిని మ‌నం వెదికి ప‌ట్టుకున్న‌ప్పుడు అదో ర‌క‌మైన సంతృప్తి భావ‌న క‌లుగుతుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న త‌ప్పులు ఉంటే సినిమాకు వ‌చ్చే న‌ష్ట‌మేమీ ఉండ‌దు. కానీ పెద్ద త‌ప్పులు చేస్తే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌లం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుకనే ద‌ర్శ‌కులు ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా చాలా సునిశితంగా గ‌మ‌నిస్తూ సినిమాలు తీస్తుంటారు. దీంతో చాలా వ‌ర‌కు త‌ప్పులు రావు. కానీ అనుకోకుండా లేదా చూడ‌కుండా వ‌స్తే ఏమీ చేయ‌లేరు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM