Yash : పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన కెజియఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. అదేవిధంగా మొదటి భాగంకు సీక్వెల్ గా కెజియఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తమ సొంత రాష్ట్రం అయిన కర్ణాటకతోపాటు సౌత్ మరియు నార్త్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. దాదాపు 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది కేజిఎఫ్ చిత్రం. కేజిఎఫ్ చిత్రం అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్ కు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.
కెజియఫ్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన హీరో యష్. ఆయన నటించిన చిత్రాలలో రారాజు మూవీ కూడా ఒకటి. ఈ రారాజు మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో పద్మావతి పిక్చర్స్ సంస్థ అక్టోబర్ 14న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా పద్మావతి ఫిలింస్ నిర్మాత సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి గాంధీ, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ, లిరిక్ రైటర్ గురు చరణ్ తదితరులు రారాజు సినిమా గురించి మాట్లాడుతూ తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సుబ్బారావు మాట్లాడుతూ యష్ అయన భార్య రాధిక పండిట్ హిరో హీరోయిన్లుగా నటించిన రారాజు చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో రారాజు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 14న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని సుబ్బారావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రారాజు చిత్రంలో సీత, రవిశంకర్, కిక్ శ్యామ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.