Balakrishna : హైదరాబాద్ లోని నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం (మే 17) సాయంత్రం కాస్త అలజడి రేగింది. ఓ మహిళ బాలకృష్ణ ఇంటి గేట్‌ను కారుతో ఢీకొట్టి అనంతరం అక్కడే ఉన్న ఫెన్సింగ్‌కు ఢీకొని ఆగిపోయింది. దీంతో చాలా సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే ఎట్టకేలకు అంతా సద్దుమణిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఓ మహిళ మహింద్రా కంపెనీకి చెందిన థార్ వాహనాన్ని నడుపుతూ వస్తోంది. అయితే వెనుక నుంచి వస్తున్న ఆంబులెన్స్‌కు దారి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె తన కారును ఓవర్ స్పీడ్‌తో నడిపించింది. దీంతో కారు కంట్రోల్ అవలేదు. ఫలితంగా ఆ కారు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది.
ఇక డివైడర్‌ను ఢీకొన్న అనంతరం ఆ కారు బాలకృష్ణ ఇంటి గేటు వద్దకు వచ్చి దాన్ని ఢీకొట్టింది. అనంతరం అక్కడే ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఇల్లు కావడంతో అసలు ఏం జరిగిందా.. అనే విషయం తెలుసుకునేందుకు అక్కడ చాలా మంది గుమిగూడారు. దీంతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ కారును తొలగించారు. అలాగే ఆ మహిళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. కానీ ఆమె మద్యం తీసుకోలేదని వెల్లడైంది. అయితే ఆంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసమే స్పీడ్‌గా కారును నడిపితే అలా జరిగిందని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…