Dimple Hayathi : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీకి ఎన్‌బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేసిన విషయం విదితమే. ఈ మూవీకి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. సీనియర్ క్యారెక్టర్‌కు జోడీగా హనీ రోజ్ వర్గీస్‌ను ఇటీవలే ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతిని అనుకున్నారు. కానీ ఈమె ఇందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఖిలాడి సినిమాలో నటించిన డింపుల్ హయతికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. పైగా అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది. దీంతో ఆ మూవీ ఫ్లాప్ అయినా.. ఈమెకు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఇకపై ఆమె ఐటమ్ సాంగ్స్ చేయొద్దని అనుకుంటుందట. దీని వల్లే ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు కూడా అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నో చెప్పడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంకో ఐటమ్ భామ కోసం చూస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఎన్‌బీకే107 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఇండియన్-ఆస్ట్రేలియన్ మోడల్ చంద్రిక రవి అనే కొత్త అమ్మాయిని తీసుకోవాలని గోపీచంద్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో టచ్‌లో ఉన్నారు. కానీ చివరి నిమిషం వరకు డింపుల్ హయతికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారట. కానీ డింపుల్ మాత్రం ఐటమ్ సాంగ్‌కు ససేమిరా.. అంటోందని సమాచారం. మరి చివరికి ఈ ఇద్దరు భామలలో ఐటమ్ సాంగ్ కోసం ఎవరు ఎంపిక అవుతారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…