భార్య భర్తల మధ్య కొన్ని సంవత్సరాల తరువాత సహజంగానే ఒకరి మీద ఉండే ఆకర్షణ ఇంకొకరికి తగ్గిపోతుంది. అయినప్పటికీ జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. అదే దాంపత్యం అంటే. కానీ ఆ మహిళ మాత్రం అలా ఆలోచించలేదు. తనను రోజూ ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఆటో డ్రైవర్‌తో పారిపోయింది. పోతూ పోతూ ఇంట్లోని రూ.47 లక్షలను తీసుకెళ్లింది. అయితే ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉన్న ఖజ్‌రానా అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ కోటీశ్వరుని భార్యను ఓ ఆటోడ్రైర్ రోజూ ఇంటి దగ్గర దింపేవాడు. అయితే ఒకరోజు ఉన్నట్లుండి ఆమె కనిపించకుండా పోయింది. అలాగే ఇంట్లో ఉన్న రూ.47 లక్షలు మాయమయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు అక్కడి ఖండ్వా, జావ్రా, ఉజ్జయిని, రత్లామ్ అనే ప్రాంతాల్లో వెదకగా చివరకు వారి ఆచూకీ లభించింది. దీంతో వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.33 లక్షలు రికవరీ చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.