దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. ఇక ఓటీటీలోనూ ఈ మూవీ ఘన విజయాన్ని సాధించి రికార్డు స్థాయిలో వ్యూస్‌ను రాబడుతోంది. ప్రస్తుతం విదేశీయులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తాజాగా RRRకు సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది. అదేమిటంటే..
RRR మూవీలో చరణ్ అల్లూరిగా, తారక్ భీమ్‌గా కనిపించిన విషయం విదితమే. అయితే మూవీ విడుదలకు ముందు సినిమా నిడివిని తగ్గించడం కోసం కొన్ని సీన్లను డిలీట్ చేశారు. వాటిల్లో రామ్ చరణ్ బాల్యం సీన్ కూడా ఒకటి ఉంది. ఇది కాన్సెప్ట్ ఆర్ట్ సీన్. ఇందులో చరణ్ చిన్నారిగా కనిపిస్తాడు. పండితుల ఆశీర్వచనాలు తీసుకుంటుంటాడు. అతని దగ్గర అగ్ని ఉంటుంది. అగ్ని సాక్షిగా అల్లూరి పండితుల సమక్షంలో ఆశీస్సులను తీసుకుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ఆర్ట్ సీన్ సినిమాలో లేదు.
కాగా ఈ సీన్‌ను RRR మూవీ కోసం పనిచేసిన కాన్సెప్ట్ డిజైనర్ విశ్వనాథ్ సుందరం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ సీన్ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు చాలా మంది ఇంత మంచి సీన్‌ను సినిమా నుంచి ఎందుకు తొలగించారు.. అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా సీన్లను ఇలాగే సినిమా నుంచి డిలీట్ చేశారని.. వాటిని అనవసరంగా తొలగించారని అంటున్నారు.
అయితే డిలీట్ చేసిన సీన్లను కనీసం యూట్యూబ్‌లో అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. మరి ఆ సీన్లను మేకర్స్ యూట్యూబ్‌లో పెడతారా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించగా.. ఇందులో హాలీవుడ్ తార ఒలివియా మోరిస్, బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగన్‌లతోపాటు శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…