NTR : నందమూరి బాలకృష్ణ కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటగలనని నిరూపించారు. అన్‌స్టాపబుల్ షోతో ఆయన ఓటీటీ వేదికపై సందడి చేశారు. బాలయ్యలో ఇంతటి ఎనర్జీ దాగి ఉందా.. అని అన్‌స్టాపబుల్ షోను చూసిన తరువాతే తెలిసింది. ఇక ఈ షో తొలి సీజన్ పూర్తయింది. చివరి ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో కొనసాగనుంది. దాన్ని ఫిబ్రవరి 4వ తేదీన ప్రసారం చేయనున్నారు.
అయితే అన్‌స్టాపబుల్ షోకు ఎంతో మంది గెస్ట్‌లు వచ్చారు. కానీ ఎన్టీఆర్ రాలేదు. షో ఆరంభంలో ఆయన కచ్చితంగా వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకపోయే సరికి నందమూరి అభిమానులు కాస్తంత నిరాశకు గురయ్యారు. అయితే అదే సమయంలో తారక్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అందువల్లే ఆయన అన్‌స్టాపబుల్ షోకు రావడం కుదరలేదని నిర్వాహకులు తెలిపారు.
ఇక త్వరలోనే అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ను నిర్వాహకులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. తొలి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌లో మరింత మంది ఆకట్టుకునే గెస్ట్‌లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్‌కు గాను ఒక ఎపిసోడ్‌కు బాలయ్యకు రూ.40 లక్షలు ఇచ్చారట. దీంతో ఆ రెమ్యునరేషన్‌ను రెండో సీజన్‌లో మరింతగా పెంచనున్నారని తెలుస్తోంది. అయితే మొదటి సీజన్‌లో తీసుకువద్దామనుకున్న గెస్ట్‌లను రెండో సీజన్‌లో తీసుకువచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. మరి రెండో సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చూడాలి.