Dogs : వాహనాల టైర్ల మీద కుక్కలు ఎక్కువగా మూత్ర విసర్జన చేయడాన్ని మనం చూస్తూనే ఉంటాం. మన వాహనాల మీద అవి మూత్రం పోస్తే మనకు తీవ్రమైన అసహనం కలుగుతుంది. వాహనాన్ని మొత్తం కడిగి మరీ శుభ్రం చేస్తాం. ఇక కొందరి వాహనాలపై అయితే ఎప్పుడూ కుక్కలు పదే పదే మూత్రం పోస్తూనే ఉంటాయి. అలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. అయితే అసలు కుక్కలు అన్ని ప్రదేశాలను వదిలి కేవలం వాహనాల టైర్ల మీదే మూత్రాన్ని ఎందుకు పోస్తాయో తెలుసా ? దీని వెనుక ఉండే కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాహనాలపై నిత్యం మనం అనేక ప్రదేశాలకు వెళ్తుంటాం. కార్లు లేదా బైక్‌లు ఏవైనా సరే.. వాహనాల సహాయంతో చాలా మంది రోజూ ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలోనే అనేక రకాల ప్రదేశాల్లో టైర్లు వెళ్తాయి. వాటికి ఆయా ప్రదేశాల్లో ఉండే మట్టి, ఇతర పదార్థాలు అతుక్కుని అవి అత్యంత అపరిశుభ్రంగా తయారవుతాయి. ఈ క్రమంలోనే అలాంటి టైర్ల నుంచి దాదాపుగా అనేక రకాల వాసనలు వస్తుంటాయి. అవి కేవలం కుక్కలకే తెలుస్తాయి. అలా వాసనలు వచ్చే సరికి ఆ టైర్లను అవి అపరిశుభ్రంగా ఉండే చోటు అని భావిస్తాయి. అందుకనే వాటిపై తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. ఇది ఒక కారణం అని చెప్పవచ్చు.
ఇక కుక్కలు ఒక్కసారి ఏదైనా వాహనానికి చెందిన టైర్లపై మూత్రం పోస్తే అవి తిరిగి మళ్లీ అదే టైర్లపై ఎందుకు మూత్రం పోస్తాయంటే.. అవి ముందుగా మూత్రం పోసినప్పుడు ఆ టైర్లను తమ ప్రదేశంగా మార్క్ చేసుకుంటాయి. దీంతో మళ్లీ తరువాత వచ్చినప్పుడు వాటి మూత్రం వాసన చూసి గుర్తు పడతాయి. అంతకు ముందు అక్కడే మూత్రం పోశాం కదా అని చెప్పి వాటికి తెలుస్తుంది. దీంతో మళ్లీ అక్కడే మూత్రం పోస్తాయి. ఇలా కొన్ని వాహనాల టైర్లపై కుక్కలు పదే పదే అక్కడే మూత్ర విసర్జన చేస్తుంటాయి.
కుక్కలకు వాహనాల టైర్లు చాలా అనువుగా ఉంటాయి. వాటి ముక్కుకు సమానంగా టైర్లు ఉంటాయి. కనుక వాసన చూసి మూత్రం పోయడం వాటికి సులభంగా ఉంటుంది. అలాగే ఇతర ఏ ప్రదేశంలో మూత్రం పోసినా ఆ వాసన త్వరగా పోతుంది. కానీ టైర్లపై మూత్రం పోస్తే మాత్రం ఆ వాసన అంత సులభంగా పోదు. దీంతో టైర్లను మళ్లీ కుక్కలు వాసన చూసి తిరిగి అక్కడే మూత్ర విసర్జన చేస్తాయి. ఇలా కుక్కలు టైర్లను తమ ప్రదేశాలుగా భావించి మార్క్ చేసుకుంటాయి. దీంతో పదే పదే అవి టైర్లపైనే మూత్రం పోస్తుంటాయి. ఇవీ.. కుక్కలు టైర్లపై మూత్ర విసర్జన చేయడం వెనుక ఉన్న అసలు కారణాలు.
అయితే ఏవైనా కుక్కలు గనుక మీ వాహనాలపై పదే పదే మూత్ర విసర్జన చేస్తుంటే.. అవి అలా చేయకుండా అడ్డుకోవచ్చు. అందుకు గాను టైర్లపై ఉండే వాసనను పోగొట్టాలి. టైర్లపై మిరియాలు లేదా కారం పొడి చల్లాలి. దీంతో వాసన పోతుంది. అక్కడ మళ్లీ కుక్కలు మూత్రం పోయవు. అలాగే మీరు ఇంట్లో వాడే ఏదైనా పెర్‌ఫ్యూమ్‌ను టైర్లపై స్ప్రే కూడా చేయవచ్చు. ఆ వాసన కుక్కలకు పడదు. అలాగే కొద్దిగా వెనిగర్‌ను కూడా స్ప్రే చేయవచ్చు. దీంతో అవి మీ వాహనాల టైర్లపై మూత్రం పోయకుండా ఉంటాయి. ఇలా కుక్కలు టైర్లపై మూత్రం పోయకుండా అడ్డుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…