Radhe Shyam : రాధేశ్యామ్ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులతోపాటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. రాధేశ్యామ్ మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ మూవీని మార్చి 11వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీతో కూడిన మూవీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మార్చి 11, 2022వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో బిగ్గెస్ట్ వార్ ఉంటుందని.. చెబుతూ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నాడు. ఇందులో ప్రభాస్ ప్రముఖ హస్త సాముద్రికుడిగా (పామిస్ట్) కనిపించనున్నారు. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా పూజా హెగ్డె.. ప్రేరణ పాత్రలో నటించింది. యూరప్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.
రాధేశ్యామ్ ఇప్పటికే విడుదల కావల్సి ఉండగా.. అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే థియేటర్లలో మార్చి 11వ తేదీన ఎట్టకేలకు విడుదల కానుంది. ఇక దీంతోపాటు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య, ఎఫ్3, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట వంటి చిత్రాలు రానున్న 3 నెలల్లో విడుదల కానున్నాయి. దీంతో ఈ వేసవి మొత్తం ప్రేక్షకులకు వినోదం లభ్యం కానుంది.
రాధే శ్యామ్‌కు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. వంశీ, ప్రమోద్, ప్రసీధలు నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…