Anjali : నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. హోమ్లీ పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ భామ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
తాజాగా కొన్ని ఫోటోలను అంజలి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూస్తుంటే ఫోటోలలో ఉన్నది ఎవరు ? మనం ఇప్పటివరకు చూసిన అంజలి యేనా ? ఆమె రూపం ఇంత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఏంటి ? సైజ్ జీరో పేరుతో ఆమె ఇంతలా బక్క చిక్కిపోయింది ఏంటి ? అని ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు.
అంజలి లేటెస్ట్ ఫోటోలను చూడగానే అందరిలోనూ చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంజలి అంటేనే ఒకప్పుడు కాస్త లావుగా ఒళ్ళు చేసి బొద్దుగా ఉండేది. అలాంటి అంజలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తమిళ హీరో జైతో చాలాకాలం ఆమె సహజీవనం చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత అంజలికి తెలుగులో ఐటమ్ సాంగ్ లో చేసే అవకాశం వచ్చింది.
నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ ఒక ఊపు ఊపింది. రా రా రెడ్డి అనే పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ ఫోటోలో స్లిమ్ లుక్ లో ఆమె అందం రెట్టింపు అయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూస్తుంటే అంజలి ప్రస్తుతం కుర్ర హీరోయిన్లకు పోటీగా అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…