Bimbisara : 2015 లో విడుదలైన పటాస్ చిత్రంతో కల్యాణ్ రామ్ హిట్‌ను అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైన బింబిసార చిత్రంతో సక్సెస్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ఫేమ్ లోకి వచ్చేశాడు. ఎటువంటి హడావుడి లేకుండా విడుదలైన బింబిసార చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల బాటలో పయనిస్తోంది.
ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా యువ దర్శకుడు వశిష్టను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించారు. ఒక పవర్ ఫుల్ కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో వశిష్ట సక్సెస్ ను సాధించారని చెప్పవచ్చు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన పరంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.
ప్రముఖ టాలీవుడ్ హీరోలు సైతం కళ్యాణ్ రామ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. అయితే వశిష్ట ఈ చిత్ర కథను కళ్యాణ్ రామ్ కంటే ముందు నలుగురు హీరోలకు చెప్పాడట. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరంటే..
మొదటగా వశిష్ట ఈ చిత్ర కథను నితిన్ తో చర్చలు జరపగా నితిన్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని సంప్రదించగా ఇలాంటి కథ తనకు సెట్ కాదని నో చెప్పేశాడట. ఆ తరవాత అల్లు శిరీష్, రాజ్ తరుణ్ వంటి వారితో కూడా కథ గురించి చర్చలు జరపగా వారు కూడా బింబిసారలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. చివరికి ఈ చిత్రం కళ్యాణ్ రామ్ ని వరించింది.
ఒకవేళ ఈ నలుగురిలో ఏ ఒక్కరు బింబిసార చిత్రంలో హీరోగా నటించినా కచ్చితంగా సక్సెస్ అయ్యి ఉండేదికాదు. కళ్యాణ్ రామ్ మాత్రమే బింబిసార చిత్రానికి అత్యద్భుతంగా సెట్ అయ్యాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన అదరహో అనిపించే విధంగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…