Vivo Y75 5G : మొబైల్స్ తయారీదారు వివో.. వై75 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. వై సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
వివో వై75 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీని వల్ల 5జి కి సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఫోన్ లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్ లో డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ ఫీచర్ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. ఫింగర్ ప్రింగ్ సెన్సార్ పక్క వైపున ఉంది.
వివో వై75 5జి ఫోన్ గ్లోయింగ్ గెలాక్సీ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.21,990 ఉండగా.. దీన్ని గురువారం నుంచే అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.