Viva Harsha : వైవా హర్ష.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వైవా హర్ష నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో ఛాన్సులు కూడా అందుకుంటున్నాడు. పలు సినిమాలలో నటించిన వైవా హర్ష ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే ఈ ఏడాది జనవరిలో అక్షర అనే అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది.
కొద్దిమంది మిత్రులతోపాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుస్మిత ఆ వేడుకకు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో తన పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పిన వైవా హర్ష రిలీజ్ డేట్ ఎప్పుడనేది చెప్పలేదు. కానీ గురువారం వైవా హర్ష హైదరాబాద్ లో తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.
హర్ష వివాహానికి హాజరైన దర్శకుడు మారుతి.. హర్షకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వివాహానికి నటుడు ప్రవీణ్, నిర్మాత ఎస్ కేఎన్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక వైవా హర్ష పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్షర విషయానికొస్తే ఆమె పూర్తి పేరు అక్షర రీసు.. ఎమ్.కాం పూర్తిచేసిన ఈ అమ్మాయి హర్షతో గత నాలుగేళ్ళుగా ప్రేమలో ఉంది. 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హర్ష.