Vishwak Sen : నటుడు విశ్వక్‌సేన్, న్యూస్ యాంకర్ దేవీ నాగవల్లిల మధ్య జరిగిన గొడవ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఈ విషయంలో దేవీ నాగవల్లికే అందరూ చీవాట్లు పెడుతున్నారు. విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. నెటిజన్లు సైతం వి ఆర్ విత్ యూ బ్రదర్, బ్యాన్ దేవీ నాగవల్లి.. అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెడుతూ విశ్వక్‌సేన్‌కే మద్దతు ఇస్తున్నారు. ఇక ఈ విషయంలో ఇప్పుడు యాంకర్ దేవిని నెటిజన్లు టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.

గతంలో సైతం యాంకర్ దేవి అనేక సార్లు నెగెటివ్ కామెంట్లు, విమర్శలను ఎదుర్కొంది. ఆమె మాట్లాడే మాటలు, భాష.. తదితర విషయాలపై నెటిజన్లు సెటైర్లు వేస్తూ మీమ్స్ సృష్టించేవారు. అయితే ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొనడం.. అక్కడ ఆమె జీవితం గురించి తెలియడంతో ఆమెపై అందరికీ మళ్లీ కాస్త సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి ఆమెపై ట్రోలింగ్, విమర్శలు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ దేవి చేసిందే తప్పని అంటున్నారు.
Is this called as Journalism?@TV9Telugu has to take a proper action on this frustrated anchor #BANAnchorDevi @VishwakSenActor pic.twitter.com/cFNKoc8hBB
— Srikanth Pagadala (@SreekanthPagad5) May 2, 2022
విశ్వక్ సేన్‌పై ముందుగా వ్యక్తిగతంగా విమర్శలు చేసిందే ఆమె అని.. కనుక ఆమె ముందుగా క్షమాపణలు చెప్పాలని.. అసలు ఆమె ఆయనను ఆ మాటలు అనకుండా ఉంటే.. విశ్వక్ సేన్ కూడా సరిగ్గానే సమాధానాలు చెప్పి ఉండేవాడని.. కానీ ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడం వల్లే ఆయన సహనం కోల్పోయి అలా మాట్లాడాడని.. కనుక ఈ విషయంలో ఆమెదే తప్పని అంటున్నారు. ఇక విశ్వక్‌సేన్‌కు మద్దతుగా మేమున్నామని హ్యాష్ ట్యాగ్‌లు పెడుతున్నారు. అదే సమయంలో బ్యాన్ దేవీ నాగవల్లి అని కూడా హ్యాష్ ట్యాగ్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
#BANAnchorDevi
😂🙏 pic.twitter.com/jh7tVHsW2A— Cinema/Cricket Lokam (@Uday_uddd) May 2, 2022
ఇక విశ్వక్ సేన్ చిన్న నటుడనే దేవి అలా మాట్లాడిందని.. కాబట్టి ఆమెదే తప్పని నెటిజన్లు అంటున్నారు. అలాగే డీజే టిల్లులోని డైలాగ్‌తో మీమ్స్ సృష్టించి కామెడీ చేస్తున్నారు. నువ్వు జస్ట్ యాంకర్‌వి అంతే.. ఆ సంస్థ నీది కాదు.. అని మీమ్స్ పెడుతున్నారు. అలాగే ఇది అసలు జర్నలిజమేనా.. నువ్వు యాంకర్‌వా.. అని కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో యాంకర్ దేవిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అయితే తాను ఎఫ్ అనే పదాన్ని వాడడం తప్పేనని అందుకు సారీ చెబుతున్నానని విశ్వక్ సేన్ మళ్లీ ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా.. లేదా.. అనేది చూడాలి.
https://twitter.com/Haripra34727992/status/1521115410807934978