Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. పోవే పోరా షోతో విష్ణుప్రియకు మంచి గురింపు వచ్చింది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో భీభత్సమైన క్రేజ్ ఉంది. ఆమె నడుము తిప్పుడు.. బెల్లీ డాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసింది. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టింది. మాస్ ఆడియన్స్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది.
ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుతంగా పాడారు. ఈ పాటకు తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో విష్ణు ప్రియ చాలా కొత్తగా కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా.. అంతకు మించి గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఈ మధ్య డ్యాన్స్ మీద కాకుండా.. ఫైట్స్, యాక్షన్, స్టంట్స్ మీద ఫొకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. స్టంట్స్ కోసం స్పెషల్‌గా విష్ణుప్రియ కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్షను తీసుకున్నట్టుంది.

ప్రస్తుతం గుళ్లు గోపురాలు అంటూ తిరిగేస్తోంది. అయితే విష్ణుప్రియ ఎప్పుడు ఎక్కడ ఎలా బిజీగా ఉన్నా కూడా నెట్టింట్లో మాత్రం తన అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. తాజాగా ఆమె అదిరిపోయే కొటేషన్ షేర్ చేసింది. కొందరు మన మాటలను అర్థం చేసుకోలేరు. కానీ కొందరు మాత్రం మనం మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారు అని ఓ కొటేషన్ ఉంది. దీన్ని షేర్ చేస్తూ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. నా చుట్టూ అందరూ అలాంటి వారే ఉన్నారు.. నేను మాట్లాడకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు.. నన్ను భరిస్తుంటారు.. నా పిచ్చి, మంచిని, తిక్కని భరిస్తుంటారు.. అని తన ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.