Viral Video : ప్రస్తుత తరుణంలో సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో మనల్ని కొన్ని ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి గడ్డం తగలబడడాన్ని గమనించవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. దీన్ని అందరూ ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అయితే ఇంతకీ అసలు ఏం జరిగిందో చూద్దాం.
ఏదో కార్యక్రమంలో ఓ యువకుడు స్టేజిపై నిలబడి నిప్పుతో స్టంట్ చేయబోయాడు. అందులో భాగంగానే అతను నోట్లోకి పెట్రోల్ తీసుకుని మంటను ఊదాడు. అయితే మంట ముందుకు వెళ్లింది. కానీ అతని గడ్డంపై పెట్రోల్ పడింది కాబోలు.. అక్కడ కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే చుట్టూ ఉన్నవారు అప్రమత్తమైన అంటుకున్న గడ్డాన్ని ఆర్పేశారు. చూస్తుంటే తక్కువ నష్టంతోనే ఆ వ్యక్తి బయట పడ్డాడు. అయితే ఆ తరువాత ఏం జరిగింది.. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కాస్త ఉంటే తీవ్ర నష్టం జరిగి ఉండేది.. భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే అతను బతికిపోయాడు.. అసలు ఇలా చేయడం అవసరమా.. నిప్పుతో స్టంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…