ఎన్టీఆర్ కు అత్తగా నటించమని త్రివిక్రమ్ అడిగితే లయ ఏమ‌ని స‌మాధానం చెప్పిందో తెలుసా.. షాక‌వుతారు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించమని స్వయంగా త్రివిక్రమే సంప్రదించినా ఒకప్పటి నటి యాక్సెప్ట్ చేయకపోవడం విశేషం. ఇంతకీ త్రివిక్రమ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయని నటి ఎవరనుకున్నారు.. లయ.. ఆవిడ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే..

అజ్ణాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రమ్, జూనియర్ ఎన్‌టీఆర్‌ ల కాంబినేషన్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నారు త్రివిక్రమ్. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులేశాడు. అందులో భాగంగానే ఒకప్పటి పరిచయంతో నటి లయను సంప్రదించారట. వీరిద్దరికీ ఎప్పుడు పరిచయం అంటే లయ మొదటి సినిమా స్వయంవరంకి త్రివిక్రమే రచయిత. లయని ఎన్టీఆర్ కి అత్తగా నటించాలని కోరారట త్రివిక్రమ్.

స్వయంవరం సినిమాతో టాలివుడ్ కి పరిచయమైన నటి లయ. తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. స్వయంవరం తర్వాత ప్రేమించు, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మలాంటి అనేక సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇద్దరు పిల్లలు, భర్తతో హాయిగా కుటుంబ జీవితాన్ని గడుపుతుంది. హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వడం, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం సర్వసాధారణం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి పాత్ర రావాలని కోరుకుంటారు. త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కంటే పెద్ద ఛాన్స్ ఏముంటుంది. కానీ లయ త్రివిక్రమ్ సినిమాలో నటించనని చాలా సున్నితంగా చెప్పేసింది.

డైరెక్టర్ గారు.. నా వయస్సెంతో తెలుసా..? ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఎలా చేయగలను.. నాకు సినిమాల్లో బాగా గ్యాప్ వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటించినా మంచి క్యారెక్టర్ చేయాలి కానీ ఈ అత్త క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించిందట లయ. దీంతో త్రివిక్రమ్ బిక్క ముఖం వేశారట. ఇప్పటికే నదియా, ఖుష్భూ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు త్రివిక్రమ్ లయ దృష్టికి తీసుకెళ్ళారట. అదంతా నాకు తెలుసు.. కానీ నేను మీరు చెప్పే క్యారెక్టర్లో అస్సలు నటించలేను. దయచేసి క్షమించడంటూ సున్నితంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిందట లయ. అందుక‌నే ఆమె అర‌వింద స‌మేత మూవీలో న‌టించ‌లేదు.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM