Viral Video : నేటి సమాజంలో ఆడవారిపై అకృత్యాలు ఎక్కువైపోయాయి. కాలం మారుతుంది. అమ్మాయిలు కూడా ధైర్యం పెంచుకుని వాళ్లను వేధించేవారిని శిక్షించడానికి ఏమాత్రం భయపడటం లేదు. తమదైన రీతిలో వాళ్లకు తగిన గుణపాఠం నేర్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి తనను వేధించాడన్న ఆరోపణతో ఓ మహిళ చెప్పులతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా ఒరాయ్ నగరంలోని ఒక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఆమెను ఈవ్ టీజ్ చేసినట్లు సమాచారం. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ తన రెండు చెప్పులతో నాన్‌స్టాప్‌గా వంగి కూర్చున్న ఒక వ్యక్తిని కొడుతోంది. ఈ వీడియో ప్రకారం ఆ మహిళ 20 సెకన్ల వ్యవధిలో అతడిని చెప్పుతో 40 సార్లు కొట్టింది. అనంతరం ఆ ప్రాంత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ట్విట్టర్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటికే 50వేలకు పైగా వ్యూస్ రాగా 530 కంటే ఎక్కువ రీట్వీట్‌లను పొందింది. చాలా మంది నెటిజన్లు ఆ ఈవ్ టీజర్‌కు బుద్ధి చెప్పినందుకు ఆ మహిళ ధైర్యాన్ని అభినందించారు. మరికొందరు అతడికి ఇదే తగిన శిక్ష అని అన్నారు. ఆ అమ్మాయి ఆ వ్యక్తికి మంచి పాఠం నేర్పింది, ప్రతి అమ్మాయి అలాంటి ధైర్యం చూపించాలి, అప్పుడే అత్యాచారాలు, వేధింపుల సమస్యలు తొలగిపోతాయి.. అని కొందరు కామెంట్స్ చేయగా.. ఒక స్త్రీ చట్టాన్ని ఇలా తన చేతుల్లోకి తీసుకోకూడదు అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…