Niharika Konidela : మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆలియా భట్ నటించిన గంగూబాయ్ లుక్‌లో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన గంగూబాయి మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా బర్త్‌డే పార్టీకి వచ్చిన నిహారిక.. గంగూబాయిలా హల్చల్ చేసింది. క్యాస్టూమ్ పార్టీ అంటేనే డిఫరెంట్ గెటప్‌లో హాజరుకావడం. ఈ పార్టీకి నిహారిక గంగూబాయ్ లుక్‌లో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముంబైకి చెందిన లేడీ డాన్ గంగూబాయ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో గంగూబాయ్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో అలియా భట్ గంగూబాయి పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించి మెప్పించింది. ఇందులో వైట్ శారీలో నుదుట బొట్టుతో ఆకట్టుకుంది. ఇక నిహారిక భర్త చైతన్య ఈ పార్టీకి వకీల్‌సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్‌లో హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. సూపర్, సౌత్ ఇండియా గంగూబాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…