Viral Video : సోషల్ మీడియా అనే మాధ్యమం చేతిలో ఉన్నాక ఎవరైనా ఊరుకుంటారా ? అందులో అనేక రకాల వీడియోలను చూస్తుంటారు. కొందరైతే నెటిజన్లను ఆకట్టుకునేందుకు రకరకాల వీడియోలను క్రియేట్ చేసి పెడుతుంటారు. దీంతో పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లను తెప్పించుకోవడంతోపాటు ఫాలోవర్లను పెంచుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఇలా పాపులర్ అయి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ డబ్బులు కూడా సంపాదిస్తుంటారు.
అయితే తాజాగా ఓ జంటకు చెందిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అందులో భార్య తన భర్తకు థర్మామీటర్ పెట్టి జ్వరం చూస్తుంది. జ్వరం ఉన్నట్లు గ్రహించి మింగమని ట్యాబ్లెట్ ఇస్తుంది. అతను నిరాకరిస్తాడు. దీంతో ఆమె మొదట బతిమాలుతుంది. కానీ రెండోసారి చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో అతను ట్యాబ్లెట్ మింగుతాడు.
https://www.instagram.com/reel/CTrQ4EnFeX-/?utm_source=ig_web_copy_link
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా చాలా మంది ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. అందరికీ ఇలాంటి భార్యలు ఉండాలని, అప్పుడు భర్తలు బుద్ధిగా ఉంటారని.. కామెంట్లు చేస్తున్నారు.