Viral Video : పిల్లలు అన్నాక అల్లరి చేయడం.. టీచర్లు అన్నాక మందలించడం సాధారణమే. చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి. అప్పుడప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. వారి చేష్టలకు పెద్దవాళ్లు కోపం తెచ్చుకుంటే కొందరు పిల్లలు చాలా స్మార్ట్‌గా ఆలోచించి కూల్ చేస్తారు. అలా ఓ పిల్లాడు తన టీచర్ కోపంగా ఉంటే కూల్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అదొక నర్సరీ స్కూల్.. పిల్లలందరూ తెగ అల్లరి చేస్తున్నారు.
ముఖ్యంగా ఓ బుడ్డోడు చేసే అల్లరిని టీచర్ అస్సలు తట్టుకోలేకపోయింది. ఇంకేముంది.. అతడిని దగ్గరకు పిలిచి.. నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్.. నీతో అస్సలు మాట్లాడను అని బుంగమూతి పెట్టింది. ఇక తన ఫెవరేట్ టీచర్ మాట్లాడకపోయేసరికి ఆ బుడ్డోడు టీచర్ ను బుజ్జగించడం మొదలుపెట్టాడు. ఇక నేను అల్లరి చేయను.. ప్లీజ్ మాట్లాడండి అంటూ బతిమాలాడాడు. లేదు.. ఇప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నువ్వు అలానే అల్లరి చేస్తున్నావ్ అంటూ టీచర్ ఇంకా అలక నటించింది.
ఇక చేయను.. ప్రామిస్ అంటూ.. తన దగ్గర ఉన్న బ్రహ్మస్త్రాన్ని సంధించాడు చిచ్చర పిడుగు. టీచర్ కు ముద్దుల వర్షం కురిసిపిస్తూ సారీ చెప్పాడు. దీంతో అలక మానిన పంతులమ్మ సైతం ఈ బుగ్గ మీద పెట్టు.. ఆ బుగ్గ మీద పెట్టు అంటూ అతడి మాటలకు తెగ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మాకు ఇలాంటి టీచర్లు ఉండరు.. అని కొందరు. ఇలాంటి టీచర్లు ఉండాలే కానీ ఎంత బుద్దిగా చదువుకొనేవాళ్లం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…