Viral Video : కొత్తగా పెళ్లయిన జంటలు సహజంగానే సరదాగా గడిపేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక వీరిలో కొందరికి ఆ యావ ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో ఎప్పుడు పడితే అప్పుడే పని కానిచేస్తుంటారు. అయితే ఇదంతా నాలుగు గోడల మధ్య ప్రైవేటుగా జరిగితే ఫర్లేదు. భార్య, భర్త అన్నాక ఆ మాత్రం అన్యోన్యంగా ఉండాలి. కానీ అవే చేష్టలను పబ్లిగ్గా చేస్తే చివరకు ఇబ్బందుల పాలు కావల్సి వస్తుంది. ఓ జంటకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామున్ని దర్శించుకునేందుకు ఓ జంట వెళ్లింది. అక్కడ దర్శనానికి వెళ్లేందుకు గాను ముందుగా సరయూ నదిలో స్నానం చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ జంట స్నానం చేశారు. అయితే వారు ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారట. దీంతో భర్త అదుపు చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే నదిలో స్నానం చేస్తున్న సమయంలో అతను తన భార్యకు ముద్దు పెట్టాడు. అయితే చుట్టు పక్కల ఇంకా భక్తులు ఉండడంతో వారు అతని చేష్టలను గమనించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని నది నుంచి బయటకు లాక్కొచ్చారు.

అలా అతన్ని నది నుంచి బయటకు లాక్కొచ్చిన భక్తులు అతనిపై దాడి చేశారు. భార్య వదిలేయాలని ప్రార్థిస్తున్నా పట్టించుకోలేదు. దీంతో కొంత సేపటికి ఎలాగే అతన్ని విడిచిపెట్టేశారు. అతను వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అదే సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/Suneet30singh/status/1539530199921852416