Viral Video : ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. చిన్న ఉద్యోగం దొరికితే చాలు, ఉపాధి లభిస్తుంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం లభించడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం దొరికిందంటే చాలు, ఇక లైఫ్ లో సెటిల్ అయినట్లేనని అందరూ భావిస్తున్నారు. కనుకనే ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతోంది.
ఇక తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంపై ఓ తల్లి భావోద్వేగానికి గురైంది. అతను సీజీడీఏ ఆడిటర్‌గా ఎంపికయ్యాడని అందరూ అభినందించారు. దీంతో అతని తల్లి ఏడ్చేసింది. ఈ క్రమంలో అతను తన తల్లిని ఓదార్చాడు. ఆన్‌లైన్ లో రిజల్ట్స్ చూసుకున్న అతను ఆ ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు పడిన సంతోషం అంతా ఇంతా కాదు. ఇక అతని తల్లి అయితే భావోద్వేగానికి గురైంది.
కాగా పైన చెప్పిన సంఘటనకు చెందిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అందరూ ఆ తల్లి ప్రేమకు ఫిదా అవుతున్నారు. తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు ఆ తల్లి పడ్డ ఆనందాన్ని, కురిపించిన ఆనంద భాష్పాలను చూసి.. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. తల్లి ప్రేమ అంటే అదేనని.. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం దొరకడం కన్నా మించింది ఇక తల్లిదండ్రులకు ఏముంటుంది.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…