Viral Video : సాధారణంగా ఇద్దరు లేక ముగ్గురు సైకిల్ మీద వెళ్లడం అనేదే కొంచెం కష్టమైన పని. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తొమ్మిది మంది పిల్లలను సైకిల్ పై ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నాడు. అంటే.. మొత్తం 10మంది ఆ సైకిల్ మీద ఉన్నట్టు అన్న మాట. ఇది అంత సింపుల్ విషయమా అన్నట్టుగా.. ఆ వ్యక్తి సైకిల్ నడపడటం వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్తున్న ఆ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ చిన్న క్లిప్‌ను జైకీ యాదవ్ అనే వినియోగదారు తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలను తీసుకువెళుతున్నాడు. ముగ్గురు పిల్లలు సైకిల్ వెనుక కూర్చొని ఉండగా, వారిలో ఒకరు ఇతరులపై నిలబడి వ్యక్తి భుజాలు పట్టుకుని కనిపించారు. ఇద్దరు పిల్లలు బైక్ ముందు బార్‌పై కూర్చొని ఉన్నారు. ఏడవ పిల్లవాడు ముందు చక్రంపైన వ్యక్తికి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు రైడర్ యొక్క చేతుల్లో స్థిరపడి, సైకిల్ రైడ్ మొత్తం అతనిని పట్టుకొని కూర్చుని ఉన్నారు.

ఈ క్లిప్ మంగళవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ వీడియోకి 216,000 కంటే ఎక్కువ వీక్షణలను మరియు 7,200 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం అనేక విధాలుగా స్పందించడం మొదలుపెట్టారు. ఒకే సైకిల్‌పై కూర్చున్న తొమ్మిది మంది పిల్లలు రైడర్‌కి చెందినవారా అని కొందరు ఆశ్చర్యపోతే.. ప్రతి విషయాన్ని తప్పుగా ఆలోచించకూడదు. ఆ పిల్లలు అందరు అతని సంతానం కాకపోవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో అలా చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఆ మనుషుల కన్నా కూడా సైకిల్, టైర్ కంపెనీ మీద నాకు ఆసక్తి పెరుగుతోంది. చాలా ధృడంగా ఉన్నాయని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు.
https://twitter.com/JaikyYadav16/status/1592438950991626241