Viral Video : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప మువీలోని సాంగ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజంకు సామాన్యుల నుంచి సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. సామి సామి సాంగ్, చూపే బంగారమాయెనా శ్రీ వల్లి సాంగ్స్ తోపాటు తగ్గేదేలే వంటి రీల్స్ తో దేశవిదేశాల్లోని అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
తాజాగా పుష్ప మూవీలోని సామీ సామీ పాటకు ఓ యువతి హుక్ స్టెప్ వేసి వేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 879k కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఆమె వేసిన స్టెప్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పుష్ప మూవీలో థర్డ్ సింగిల్‌గా గతేడాది అక్టోబర్‌లో సామి సామి సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటకు చంద్రబోస్ అందించిన లిరిక్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి. ఈ సాంగ్ లిరికల్ వీడియోకి యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 63 మిలియన్ల వ్యూస్ రాగా.. వీడియో సాంగ్‌కి 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.