Viral Video : తమిళ నటుడు విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా నటించిన బీస్ట్ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ మూవీ బాగా లేదని సాక్షాత్తూ విజయ్ అభిమానులే చెన్నైలో ఏకంగా ఓ థియేటర్ తెరను దగ్ధం చేశారు. అయితే ఈ మూవీలోని పాటలు మాత్రం బాగా హైలైట్ అయ్యాయి. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించడంలో పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలోని అరబిక్ కుతు పాట బాగా హిట్ అయింది. దీనికి చాలా మంది సెలబ్రిటీలు సైతం డ్యాన్స్‌లు చేసి ఎంజాయ్ చేశారు. వారి వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి చాలా మంది స్టెప్స్ వేస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ యువతి అరబిక్ కుతు పాటలో పూజా హెగ్డె వేసిన స్టెప్స్‌కు అనుగుణంగానే స్టెప్స్ వేసి అలరించింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పూజా హెగ్డెకు తగ్గట్లుగా ఆ యువతి డ్యాన్స్ చేసింది. దీంతో ఆమెను నెటిజన్లు కొనియాడుతున్నారు. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావని అంటున్నారు.

ఇక బీస్ట్ మూవీ ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ కాగా.. దీనికి రూ.150 కోట్ల బడ్జెట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేశారు, స్టార్ హీరో కనుక రూ.250 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
#viralvideo #arabickuthu pic.twitter.com/0TZhd3Qp4f
— India Daily Live (@IndiaDailyLive) June 26, 2022