Viral Video : ప్రస్తుత తరుణంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. గతంలో కన్నా నిరుద్యోగిత రేటు బాగా పెరిగింది. ఇంకో వైపు కోవిడ్ కారణంగా చాలా మంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో చాలా మంది బతుకు బండిని అత్యంత భారంగా ఈడుస్తున్నారు. అయితే కొందరికి అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఖాళీగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి ఆ యువకుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు వైకల్యం ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా స్వయం ఉపాధి మార్గమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. దీంతో అతను అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఓ యువకుడు తనకు రెండు చేతులు లేకపోయినా.. తోపుడు బండిపై నూడుల్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. కాగా అతని వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆ యువకుడి నిబద్ధతను.. అంకిత భావాన్ని.. శ్రమను అందరూ మెచ్చుకుంటున్నారు.
It will cost you $0 to retweet 💞
Responsibility 💔 pic.twitter.com/eJ3OwtFW1N
— Rahul Mishra (@DigitalRahulM) April 5, 2022
రెండు చేతులు లేకపోయినా ఆ యువకుడు అలా నూడుల్స్ తయారు చేసి విక్రయిస్తూ తన కాళ్లపై తాను నిలబడి చూపిస్తున్నాడు. దీంతో అతనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఉద్యోగం లేదని లేదా ఉన్నా పనిచేయడం ఇష్టంలేని వారందరికీ అతను ప్రేరణగా నిలుస్తున్నాడని.. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ యువకుడు ఎవరో తెలియదు. కానీ అతనికి సహాయం అందించేందుకు మాత్రం చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ యువకుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు.. అనేది తెలుస్తుందేమో చూడాలి.