Viral Photo : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగంతో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ గా మారుతోంది. సెలబ్రెటీలు సైతం అభిమానులకు ఎంతో దగ్గరవుతున్నారు. అభిమానులతో అప్పుడప్పుడూ సోషల్ మీడియా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతూ, అభిమానులు అడిగే ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానం ఇవ్వడమే కాకుండా తమ జ్ఞాపకాలను కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులకు కనులవిందు చేస్తున్నారు.
తాజాగా ఒక చిన్నారి పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ తన చిన్ననాటి క్యూట్ ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జీన్స్ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తూ చిన్నారి చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఈ హీరోయిన్ మన టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

పవన్ కళ్యాణ్, రామ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఎన్నో విజయాలను అందుకుంది. ఈ ఫోటోలో క్యూట్ గా కనిపించే ఆ చిన్నారే ఇలియానా. రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఇలియానా. మొదటి చిత్రమే సక్సెస్ కావడంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. పోకిరి, జల్సా, కిక్ వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ ను తన కైవసం చేసుకుంది. బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు దూరమైంది. బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు దక్కించుకొని టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది ఇలియానా. ఇలియానా ప్రస్తుతం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ, శీర్ష గుహ ఫిల్మ్ సంస్థలో ఒక చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.