Viral Photo : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. ఆరంభంలో చప్పగా ఉన్నా.. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ ఈ లీగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇక కరోనా ప్రభావం తగ్గుతుండడంతో స్టేడియంలలోకి మరింత మంది ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు. అయితే స్టేడియాలలోకి వచ్చే ప్రేక్షకులు కొందరు చేస్తున్న పనులు కెమెరా కంట పడుతున్నాయి. ఈ క్రమంలోనే అలాగే ఓ జంట కూడా కెమెరాకు చిక్కింది. అయితే వారు సాధారణంగా కూర్చుని కాదు.. ముద్దు పెట్టుకుంటూ.. కెమెరాకు చిక్కారు.
శనివారం గుజరాత్ టైటాన్స్‌కు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ సమయంలో ఓ జంట స్టాండ్స్‌లో కూర్చుని ముద్దు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. ఈ క్రమంలోనే వారు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు తీసిన ఫొటో వైరల్‌గా మారింది. దీన్ని చూసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు వస్తున్నారా.. లేక ముద్దులు పెట్టుకోవడానికా.. ఇంకా ఎక్కడా ప్లేస్ లేదా.. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ ఫొటోకు స్పందించిన ప్రముఖ ఎంటర్‌ప్రిన్యూర్ చిరాగ్ భర్జత్య.. ఐపీఎల్‌లో కిస్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని చమత్కరిస్తూ కామెంట్ చేశారు. దీంతో ఆయన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్లు కూడా స్పందించారు. అవును.. మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకే కాకుండా.. ఇలాంటి సీన్లను కాప్చర్ చేసేందుకు కిస్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని.. నెటిజన్లు కోరుతున్నారు. ఇక ఈ ఫొటో అనేక సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…