Ram Gopal Varma : సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా అందులో కొంత కాంట్రవర్సీతో పాటు ఫన్ ఉంటుంది. సమాజంలో ప్రతి విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉండే వర్మ తన సినిమాలని ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట. తాజాగా వర్మ డేంజెరస్ అనే మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ పలు ప్రాంతాలలో చక్కర్లు కొడుతున్నాడు. అంతేకా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోలు పెడుతూ ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా కేఏ పాల్ మాటల్ని వేరే వాయిస్ కి సింక్ చేసి అందరూ కచ్చితంగా డేంజరస్ సినిమాని మొదటి రోజే చూడాలని చెప్పించే ప్రయత్నం చేశారు.
ఇటీవల కేఏ పాల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో తన ఫాలోవర్లతో లైవ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై కేఏ పాల్ స్పందిస్తూ.. ప్రతీ రోజు ఓ కొత్త సినిమా వస్తుంది. అన్నింటినీ ఎవరు గుర్తుంచుకుంటారు. ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడూ వినలేదు. అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు మీకు వేరే పనులేమి లేవా..? అని యువతను ప్రశ్నించాడు. మీరు విడుదలైన ప్రతీ సినిమాను చూస్తారా..? అని ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరూ సమాజంలో మార్పు కోసం పనిచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఉపయోగపడే పని చేయాలి.. నిర్మాణాత్మకంగా ఉండాలి.. అని అన్నారు.
ఎవరైనా సినిమా తీస్తే.. మీరు దాన్ని చూస్తారు. ఇది పూర్తిగా టైం వృథా. మీరు ఆ సినిమా నుంచి ఎలాంటి మంచి విషయాన్ని పొందలేరు. కనీసం అర్థవంతమైన సినిమాలు చూడండి. నేనెప్పుడూ ఆర్ఆర్ఆర్ గురించి వినలేదు. అసలు అదేంటో నాకు తెలియదు.. అని పాల్ అన్నాడు. ఇదే వీడియోకి వర్మ వాయిస్ సింక్ చేయించి డేంజరస్ మూవీని చూడమని చెప్పినట్టుగా వీడియో విడుదల చేశారు. మీ చుట్టుపక్కల ఉన్నవారందరినీ ఈసారి తప్పనిసరిగా ఆర్జీవీ డేంజరస్ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడాలి. ఎవరెవరు ఏవేవో సినిమాలు తీస్తే ఫస్ట్ డే వెళ్లి చూస్తారు. టైమ్ వేస్ట్ తప్ప దానివల్ల వచ్చే లాభమేంటి. ఏవైనా అర్థవంతమైన సినిమాలు ఉంటే చూడాలి. నా దృష్టిలో అర్థవంతమైన మూవీ డేంజరస్.. అంటూ కేఏ పాల్ వీడియోకి మిమిక్రీ వాయిస్‌ను జోడించారు. దీనిపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…