Vikram Movie : అగ్ర హీరోల సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్న వేళ.. సీనియర్ నటుడు కమలహాసన్ నటించిన విక్రమ్ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ మూవీని థియేటర్లలో ఇంకా భారీ ఎత్తున ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ భారతీయ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టిస్తోంది. చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లతోపాటు ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం కమలహాసన్ విక్రమ్ మూవీ తమిళనాడులో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. గతంలో ఈ రికార్డు బాహుబలి 2 పేరిట ఉండేది. దాన్ని విక్రమ్ మూవీ బద్దలు కొట్టింది.
విక్రమ్ మూవీ ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. దీంట్లో కమలహాసన్‌తోపాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్, సూర్యలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ కథను అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. ఇక కమలహాసన్ ఈ సినిమా అందించిన హిట్‌తో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే దర్శకుడితోపాటు చిత్ర యూనిట్ సిబ్బందికి ఆయన వివిధ రకాల గిఫ్ట్‌లను అందించారు. అయితే విక్రమ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

విక్రమ్ సినిమాకు గాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో అందులో ఈ మూవీ విడుదల కానుంది. జూలై 8వ తేదీన ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల అయ్యాక నెల రోజుల అనంతరం ఓటీటీలోకి వస్తుండడం విశేషం. థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కనుక ఓటీటీలోనూ అదే రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమ్ చేయనున్నారు.